AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గులకరాళ్లపై వాకింగ్‌ చేస్తే ఇన్ని లాభాలా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

ఒళ్లంతా చెమటలు పట్టేలా కొంత మంది నడిస్తే అసలు ఏ మాత్రం అలిసిపోకుండా ఇంకొందరు నడుస్తుంటారు. మరికొందరు కాళ్లకు చెప్పులు, షూస్‌ వేసుకుని నడుస్తుంటారు. ఇంకొందరు చెప్పులు లేకుండా నడుస్తుంటారు. ఇలా వాకింగ్‌ విధానంలో దేని ప్రయోజనాలు దానికే ఉంటాయి. కానీ, గులకరాళ్లపై నడిస్తే ఏమౌతుందో తెలుసా..?

గులకరాళ్లపై వాకింగ్‌ చేస్తే ఇన్ని లాభాలా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
Pebble Stone
Jyothi Gadda
|

Updated on: May 24, 2025 | 4:55 PM

Share

ఇటివలి కాలంలో ప్రజలందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. మంచి ఆరోగ్యం కోసం సరైన ఆహారంతో పాటుగా వ్యాయామం, ధ్యానం, యోగ వంటివి కూడా అలవాటు చేసుకుంటున్నారు. రోగాల బారిన పడకుండా ఉండేందుకు మరికొందరు వాకింగ్‌, జిమ్ కి వెళ్లి రకరకాల వర్కౌట్స్ చేస్తున్నారు. కానీ, ఎక్కువ మంది మాత్రం వ్యాయామం కోసం వాకింగ్ చేస్తుంటారు. ఇలా వాకింగ్‌లో కొంత మంది చాలా వేగంగా నడుస్తారు. మరి కొంత మంది చాలా నెమ్మదిగా నడుస్తుంటారు. ఒళ్లంతా చెమటలు పట్టేలా కొంత మంది నడిస్తే అసలు ఏ మాత్రం అలిసిపోకుండా ఇంకొందరు నడుస్తుంటారు. మరికొందరు కాళ్లకు చెప్పులు, షూస్‌ వేసుకుని నడుస్తుంటారు. ఇంకొందరు చెప్పులు లేకుండా నడుస్తుంటారు. ఇలా వాకింగ్‌ విధానంలో దేని ప్రయోజనాలు దానికే ఉంటాయి. కానీ, గులకరాళ్లపై నడిస్తే ఏమౌతుందో తెలుసా..?

వాకింగ్‌లో అనేక పద్ధతులు ఉన్నాయి. అయితే, గులకరాళ్లపై కాళ్లకు చెప్పులు లేకుండా నడవటం వల్ల మనం ఊహించని లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గులక రాళ్లపై నడక వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో శరీరంలోని విషాలను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. ఇది సాధారణంగా వ్యాయామంలా పనిచేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. రోజువారీ గులకరాళ్ళతో నడవడం వల్ల వృద్ధులలో రక్తపోటు తగ్గుతుంది. గులకరాళ్లపై నడిస్తే బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

గులకరాళ్లపై ఎలాంటి చెప్పులు, షూస్‌ లేకుండా నడవడం వల్ల పాదాల్లోని నాడీ ముద్రలను ఉత్తేజితం చేసి రక్త ప్రసరణను పెంచుతుంది. పాదాల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. రుమాటిక్ వ్యాధులను నివారిస్తుంది. ఇది ఒక విధంగా ఎలాంటి ఖర్చు లేకుండా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేని ప్రకృతి వైద్యంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి, అందుబాటులో ఉన్నవారు ప్రతి రోజు 10 నిమిషాలు గులకరాళ్లపై నడవటం అలవాటు చేసుకోవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..