India vs Pak: పహల్‌గామ్ ఎఫెక్ట్.. మైసూర్‌పాక్‌లో ‘పాక్’ తీసేశారు..కారణం ఏంటంటే..!
దాంతో జైపూర్‌లోని ప్రముఖ త్యోహార్ స్వీట్స్ యజమాని వెంటనే స్పందించారు. తన దుకాణంలో మైసూర్ పాక్ స్వీట్ పేరులోని ‘పాక్’ పదాన్ని తొలగించి ‘మైసూర్ శ్రీ’గా పేరు మార్చారు. దేశంపై భక్తి భావంతో తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

పహల్‌గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై భారత ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొందరు మైసూర్‌పాక్ పేరును మార్చాలని సూచించారు. దాంతో జైపూర్‌లోని ప్రముఖ త్యోహార్ స్వీట్స్ యజమాని వెంటనే స్పందించారు. తన దుకాణంలో మైసూర్ పాక్ స్వీట్ పేరులోని ‘పాక్’ పదాన్ని తొలగించి ‘మైసూర్ శ్రీ’గా పేరు మార్చారు. దేశంపై భక్తి భావంతో తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
షాప్ యజమాని అంజలి జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. వీరి మెనూలోని మైసూరు పాక్ (Mysore Pak) ఇకపై మైసూరు శ్రీ(Mysore Sri)గా, మోతీ పాక్-మోతీ శ్రీగా, ఆమ్ పాక్-ఆమ్ శ్రీగా, గోండ్ పాక్-గోండ్ శ్రీగా, స్వర్ణ భస్మ పాక్-స్వర్ణ భస్మ శ్రీగా, చందీ భస్మ పాక్-చందీ భస్మ శ్రీగా పేరు మార్చబడ్డాయి. అయితే “పాక్” అనే పదం కన్నడలో చక్కెర సిరప్‌ను సూచిస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




