Watch: వారెవ్వా.. ఏం ఐడియా గురూ..! ఇలాంటి టీ ఫిల్టర్ ఎక్కడా చూసుండరు..చూస్తే షాక్ అవ్వాల్సిందే..
వైరల్ వీడియోలో ఒక వ్యక్తి టీ తయారు చేశాడు. మామూలుగా అందరూ చేసినట్టుగానే పాలు, చక్కెర, టీ ఆకులు వేసి బాగా మరిగించి చాయ్ తయారు చేశాడు. కానీ, తయారైన టీ వడకట్టి తాగేందుకు అతడి వద్ద టి జల్లెడ లేదు.. దాంతో అతడు ఒక ఉపాయం చేశాడు. చుట్టు పక్కల ఉన్నటువంటి

టీ తాగనిదే చాలామందికి తెల్లారదు. ప్రపంచ వ్యాప్తంగా తాగు నీటి తరువాత ఎక్కువ మంది తాగుతున్నది చాయ్ నే. ముఖ్యంగా మన దేశం లో టీ ప్రియులు కోట్లలో ఉన్నారు. ఇందులో అనేక రకాల టీలు తయారు చేస్తుంటారు. కొందరు అల్లం చాయ్, మసాలా టీ, బెల్లం టీ ఇలాంటివి ఎన్నో వెరైటీ టెస్టులతో చాయ్ తయారు చేస్తుంటారు. పాలు, పంచదార, టీ పౌడర్‌తో పాటుగా ఇతర మసాలాలు కూడా టీ తయారీ కోసం వాడుతుంటారు. ఇక చాయ్ రెడీ అయ్యాక దాన్ని ఫిల్టర్ చేసి తాగుతుంటారు. టీ ఫిల్టర్ అందుబాటులో లేకపోవడంతో ఓ వ్యక్తి చేసిన జుగాడ్ ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది. టీ జల్లెడ లేకుండా అతడు టీ వడకట్టిన విధానం చూసి నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేశారు. ఇంతకీ వైరల్ వీడియోలో ఏముందంటే..
వైరల్ వీడియోలో ఒక వ్యక్తి టీ తయారు చేశాడు. మామూలుగా అందరూ చేసినట్టుగానే పాలు, చక్కెర, టీ ఆకులు వేసి బాగా మరిగించి చాయ్ తయారు చేశాడు. కానీ, తయారైన టీ వడకట్టి తాగేందుకు అతడి వద్ద టి జల్లెడ లేదు.. దాంతో అతడు ఒక ఉపాయం చేశాడు. చుట్టు పక్కల ఉన్నటువంటి ఎండిపోయిన మొక్కలను సేకరించాడు. వాటన్నింటిని దగ్గరగా పేర్చి నెట్‌ల తయారు చేసి పట్టుకున్నాడు. అలా ఎండిన కొమ్మల మీదుగా టీని వడగట్టి పోసుకున్నాడు. అలా టీలోని ఆకులు, యాలకులు, టీ పౌడర్ అంతా వేరుగా ఉండిపోయింది. ఇదంతా చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టారు.
వీడియో ఇక్కడ చూడండి..
ये तरीका भारत से बाहर नहीं जाना चाहिए 😂☕️ ❤️ pic.twitter.com/3QOZ5e2Teu
— चाय गलियारा (@chaigaliyara) May 22, 2025
సోషల్ మీడియా @chaigaliyara పేరుతో ఉన్న X వేదికగా ఈ వీడియోని పోస్ట్ చేశారు. క్యాప్షన్‌లో ఇలా రాశారు.. ఇలాంటి ఐడియాలు మన దేశం దాటి వెళ్లకూడదు భయ్యా అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్ చేశారు. అలా ఇప్పటివరకు ఈ వీడియోను 1.5 లక్షలకు పైగా వీక్షించారు. వేల సంఖ్యలో వినియోగదారులు లైక్ చేశారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తూ కామెంట్లు చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




