AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ.. వర్షంలో విద్యుత్‌ లైట్లు తడవకుండా భలే ప్లాన్‌ చేశారుగా.. చూస్తే బిత్తరపోవాల్సిందే..!

ఈ పోస్ట్‌పై చాలా మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు. చాలా మంది దీనిపై ఇలా స్పందించారు..ఇలాంటి ట్రిక్స్  ట్రై చేసే ముందు ఖచ్చితంగా ఎలక్ట్రీషియన్ సహాయం తీసుకోండి అంటూ సూచిస్తున్నారు. మరికొందరు ఆ వ్యక్తి తెలివితేటలను ప్రశంసిస్తున్నారు. వర్షాకాలంలో ఇలాంటి ఐడియాలు తప్పక అవసరం రావొచ్చు అంటున్నారు మరికొందరు.

వార్నీ.. వర్షంలో విద్యుత్‌ లైట్లు తడవకుండా భలే ప్లాన్‌ చేశారుగా.. చూస్తే బిత్తరపోవాల్సిందే..!
How To Save Bulb From Rain
Jyothi Gadda
|

Updated on: May 23, 2025 | 7:23 PM

Share

దేశవ్యాప్తంగా వాతావరణం చూస్తుంటే ఎండాకాలం వెళ్లిపోయినట్టుగానే ఉంది.. అరేబియా సముద్రంతో పాటు, బంగాళాఖాతంలోనూ అల్పపీడన ప్రభావంతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అయితే, వర్షాకాలం రాగానే విద్యుత్‌ అంతరాయం సహజంగానే ఉంటుంది. దానికి తోడు ఇంటి బయటి లైట్లు సరిగ్గా వెలగకపోవడం వంటి సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. దాంతో తరచూ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి బల్బును వర్షంలో తడవకుండా, నిరంతరాయంగా వెలిగేందుకు ఎవరూ ఊహించని హ్యాక్‌ చేశాడు. ఇదేదో భలేగా ఉందండోయ్.. మీకు కూడా ఉపయోగపడుతుందనుకుంటా..వచ్చేది ఎలాగూ వర్షాకాలం. కాబట్టి మీరు ఈ హక్స్ నేర్చుకుంటే బెటర్‌ అంటున్నారు నెటిజన్లు..పూర్తి వివరాల్లోకి వెళితే…

వైరల్‌ వీడియోలో ఒక వ్యక్తి ఇంటి బయట గోడకు అమర్చిన బల్బుపై వర్షం నీరు పడకుండా ఉండేందుకు ఒక ఉపాయం చేశాడు. విద్యుత్‌ బల్బ్‌ నీటిలో తడవకుండా ఉండేందుకు దానికి ఒక ప్లాస్టిక్ బాటిల్‌ తొడిగించాడు..ఇందుకోసం అతడు బల్బ్‌కు బాటిల్‌ హోల్డర్‌ను మూతతో పాటు గోడలో నట్-బోల్ట్‌తో బిగించాడు.. ఆ బాటిల్‌ లోపల బల్బును మూసివేశాడు. ఈ బల్బులు LED లైట్లుగా తెలుస్తోంది. ఇవి 100W బల్బు కంటే చాలా తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి అది ప్లాస్టిక్‌ బాక్స్‌పై పెద్దగా ఎలాంటి ప్రభావాన్ని చూపే అవకాశం లేదు. కానీ, ఈ ట్రిక్‌ను మీ సొంత తెలివి తేటలతో ట్రై చేస్తే మాత్రం విద్యుత్‌ షాక్‌ తగిలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రీషియన్ సహాయం లేకుండా పొరపాటున కూడా విద్యుత్ వైర్ల జోలికి అస్సలు వెళ్లకండి..

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ రీల్‌ను @unnaoelectric అనే హ్యాండిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వార్త రాసే సమయానికి దీనికి 92 లక్షలకు పైగా వ్యూస్‌ రెండున్నర లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ పోస్ట్‌పై చాలా మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు. చాలా మంది దీనిపై ఇలా స్పందించారు..ఇలాంటి ట్రిక్స్  ట్రై చేసే ముందు ఖచ్చితంగా ఎలక్ట్రీషియన్ సహాయం తీసుకోండి అంటూ సూచిస్తున్నారు. మరికొందరు ఆ వ్యక్తి తెలివితేటలను ప్రశంసిస్తున్నారు. వర్షాకాలంలో ఇలాంటి ఐడియాలు తప్పక అవసరం రావొచ్చు అంటున్నారు మరికొందరు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..