AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: మరోమారు వైరస్‌ దాడి.. 9 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌.. ఆరోగ్య శాఖ అలర్ట్‌..!

కర్నాటక ఆరోగ్య శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం.. 2025 జనవరిలో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఫిబ్రవరిలో ఒక కేసు నమోదైంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో మూడు కేసులు వెలుగు చూశాయి. మే నెలలో మాత్రం కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందింది. మే 23వ తేదీ వరకు 33 కొవిడ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Tests Positive
Jyothi Gadda
|

Updated on: May 23, 2025 | 5:53 PM

Share

కోవిడ్‌-19 మరోమారు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. 2019లో యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహామ్మారి మరోమారు చాప కింద నీరులా విజృంభిస్తోంది. దేశంలో మళ్లీ కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణతో పాటు కర్నాటకలోనూ కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బెంగళూరులో 9 నెలల శిశువు వైరస్‌ పాజిటివ్‌గా వచ్చింది.

బెంగళూరులో తొమ్మిది నెలల పసికందుకు కోవిడ్‌-19కు పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టుగా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మే 22న రాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ ద్వారా శిశువుకు పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ హర్ష్‌ గుప్తా తెలిపారు. శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రస్తుతం బెంగళూరులోని కలాసిపాల్యలోని వాణి విలాస్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా వెల్లడించారు.

కర్నాటక ఆరోగ్య శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం.. 2025 జనవరిలో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఫిబ్రవరిలో ఒక కేసు నమోదైంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో మూడు కేసులు వెలుగు చూశాయి. మే నెలలో మాత్రం కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందింది. మే 23వ తేదీ వరకు 33 కొవిడ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..