Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: గ్యాంగ్‌రేప్ నిందితులకు బెయిల్.. భారీ ఊరేగింపుతో ఊర్లోకి ఘన స్వాగతం

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 2024 జనవరిలో ఓ జంటపై దాడి చేసి, మహిళపై అత్యాచారం చేసిన కేసులో తాజాగా బెయిల్ పొందిన ఏడుగురు నిందితులు అక్కి ఆలూర్ ప్రాంతంలో బైక్‌లు, కార్లతో ర్యాలీ నిర్వహించారు. లౌడ్ స్పీకర్లతో మ్యూజిక్ పెట్టుకొని నినాదాలు చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Watch: గ్యాంగ్‌రేప్ నిందితులకు బెయిల్.. భారీ ఊరేగింపుతో ఊర్లోకి ఘన స్వాగతం
Haveri Gang Rape Case
Jyothi Gadda
|

Updated on: May 23, 2025 | 4:16 PM

Share

కర్ణాటకలోని ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. హవేరీ జిల్లాకు చెందిన ఏడుగురు గ్యాంగ్‌రేప్‌ నిందితులు జైలు నుంచి విడుదలైన సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. ఓపెన్ కార్ల కాన్వాయ్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్లు, బైకులతో రోడ్‌షో నిర్వహిస్తూ.. వారిని హీరోలుగా స్వాగతించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 2024 జనవరిలో ఓ జంటపై దాడి చేసి, మహిళపై అత్యాచారం చేసిన కేసులో తాజాగా బెయిల్ పొందిన ఏడుగురు నిందితులు అక్కి ఆలూర్ ప్రాంతంలో బైక్‌లు, కార్లతో ర్యాలీ నిర్వహించారు. లౌడ్ స్పీకర్లతో మ్యూజిక్ పెట్టుకొని నినాదాలు చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మే20 మంగళవారం నాడు హవేరి సెషన్స్ కోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారికి తమ స్నేహితులు హీరో తరహా స్వాగతం ఏర్పాటు చేశారు. వారంతా గత 17 నెలలకు పైగా వీరంతా జ్యుడీషియల్ కస్టడీలో జైలులో ఉన్నారని తెలిసింది. అయితే, కోర్టు వీరికి బెయిల్‌ మంజూరు చేయటంతో ఇలా భారీ ఊరేగింపుతో ఊర్లోకి చేరారు. గ్యాంగ్‌రేప్ నిందితులు లగ్జరీ కార్లు, బైక్‌లపై విజయోత్స ర్యాలీ నిర్వహించటం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాంగ్ రేప్ నిందితులు ఇలా బహిరంగంగా సంబరాలు చేసుకోవటం పట్ల ప్రజా సంఘాలు సైతం భగ్గుమంటున్నాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి…

గ్యాంగ్‌ రేప్‌ నిందితుల ఊరేగింపు వేడుకల వీడియోలు సోషల్ మీడియా అన్ని ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ కావడంతో పోలీసులు కూడా చర్య తీసుకున్నారని తెలిసింది.. హవేరి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్షు కుమార్ శ్రీవాస్తవ ఈ కేసును ధృవీకరించారు. వేడుకల ఊరేగింపుకు సంబంధించి చట్టవిరుద్ధంగా ర్యాలీలు, ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నిందితులపై కేసు నమోదు చేసి, వారి బెయిల్‌ను రద్దు చేయమని కోర్టుకు అప్పీల్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Hydra: సలకం చెరువులో ఓవైసీ కాలేజీని ఎందుకు కూల్చడం లేదంటే...
Hydra: సలకం చెరువులో ఓవైసీ కాలేజీని ఎందుకు కూల్చడం లేదంటే...
పెట్రోల్‌ బంకుల్లో ఇంధనం వేసుకుంటున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే!
పెట్రోల్‌ బంకుల్లో ఇంధనం వేసుకుంటున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే!
పవన్‌తో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? ఆఫీసుకు పిలిచి లక్ష రూపాయలు
పవన్‌తో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? ఆఫీసుకు పిలిచి లక్ష రూపాయలు
Andhrapradesh: ఇవాళ ఏపీలో పేరెంట్‌-టీచర్‌ మెగా ఈవెంట్‌...
Andhrapradesh: ఇవాళ ఏపీలో పేరెంట్‌-టీచర్‌ మెగా ఈవెంట్‌...
యువకులకు భలే ఛాన్స్.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలకు ప్రకటన
యువకులకు భలే ఛాన్స్.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలకు ప్రకటన
TS Cabinet: నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం...
TS Cabinet: నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం...
'4ఏళ్లల్లో ఏ ఒక్క ఏడాది ఇతర రాష్ట్రాల్లో చదివినా స్థానికేతరులే..'
'4ఏళ్లల్లో ఏ ఒక్క ఏడాది ఇతర రాష్ట్రాల్లో చదివినా స్థానికేతరులే..'
తగ్గుతున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా? తగ్గుతాయా? తులం ఎంత?
తగ్గుతున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా? తగ్గుతాయా? తులం ఎంత?
Horoscope Today: మెరుగ్గా ఆ రాశివారి ఆర్థిక పరిస్థితి..
Horoscope Today: మెరుగ్గా ఆ రాశివారి ఆర్థిక పరిస్థితి..
సినిమాల్లో నటించాలనుకుంటున్నారా? ఆడిషన్స్‌కు వచ్చేయండి మరి
సినిమాల్లో నటించాలనుకుంటున్నారా? ఆడిషన్స్‌కు వచ్చేయండి మరి