Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

25 మంది పెళ్లి కొడుకులు.. ఒక్కతే పెళ్లి కూతురు

25 మంది పెళ్లి కొడుకులు.. ఒక్కతే పెళ్లి కూతురు

Phani CH

|

Updated on: May 23, 2025 | 3:38 PM

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య ఘట్టం. అయితే ఇటీవలి కాలంలో పెళ్లికాని ప్రసాద్‌లు ఎక్కువవుతున్నారు. ఇలాంటి వారినే టార్గెట్ చేసిన ఓ యువతి నిత్య పెళ్లికూతురు అవతారమెత్తింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 25 మందిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నగలు, డబ్బు, విలువైన వస్తువులతో ఉడాయిస్తున్న ఈ కిలేడిని తాజాగా రాజస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్లితే.. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌‌కు చెందిన అనురాధ పాశ్వాన్ గతంలో ఓ ఆసుపత్రిలో పనిచేసేది. భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకుని మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు మకాం మార్చింది. అక్కడ ఓ పెళ్లిళ్ల రాకెట్‌తో చేతులు కలిపి వయసు పెరుగుతూ పెళ్లిళ్లు ఆలస్యం అయ్యే యువకులను టార్గెట్‌గా చేసుకుంది. వారితో పెళ్లి కుదుర్చుకుని చట్టబద్ధంగానే పెళ్లిళ్లు చేసుకునేది. ఆ తర్వాత అనురాధ కొద్దిరోజులు అత్తారింట్లో ఉండి, వీలు చిక్కగానే బంగారం, క్యాష్‌, విలువైన వస్తువులతో ఉడాయించేది. అనంతరం వేరే ప్రాంతానికి మకాం మార్చి కొత్త పేరు, కొత్త గుర్తింపు కార్డులతో 7 నెలల్లోనే ఏకంగా 25 మందిని మోసం చేసింది. అనురాధ చేతిలో మోసపోయిన సవాయ్ మాధోపూర్‌కు చెందిన విష్ణు శర్మ పోలీసులను ఆశ్రయించటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు పెళ్లిళ్లు కుదుర్చే ఏజెంట్లకు రూ. 2 లక్షలు చెల్లించి అనురాధతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నానని, ఏప్రిల్ 20న ఆమెతో పెళ్లయిందని, మే 2న ఆమె నగలతో పారిపోయిందని శర్మ పోలీసులకు తెలిపాడు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఒక కానిస్టేబుల్‌ను పెళ్లి కొడుకుగా నమ్మించి, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

51 రోజులు.. 1,000 కి.మీ.. శ్రీలంక మీదుగా ఆంధ్రాకు