300 కార్లు.. 38 విమానాలు.. ఇది కదా రాయల్ లైఫ్ అంటే వీడియో
300 కార్లు, 38 విమానాలు.. ఇది కాన రాజరిక లైఫ్ అంటే..! 300 లగ్జరీ కార్లు, 38 విమానాలు, 50కి పైగా విలాసవంతమైన షిప్పులు, వజ్ర వైఢూర్యాలు, బంగారు సింహాసనాలతో ప్రపంచ ధనవంతుడిగా థాయ్ లాండ్ రాజు మహా వజీరా లాంగ్ కొన్ కి పేరు ఉంది. తండ్రి ఆ దేశానికి ఒకప్పటి రాజు. అయితే వారసత్వంగా వచ్చిన సంపదను ఆయన తింటూ కూర్చోలేదు. కంపెనీలలో పెట్టుబడులు పెట్టి, స్థలాలను లీజుకిచ్చి కోట్లలో సంపాదిస్తున్నారు. ప్రస్తుతం థాయ్ రాజు సంపద 3.7 లక్షల కోట్ల రూపాయలు. ఆయనేమి అదానీ అంబానీలంత రిచ్ పర్సన్ కాదు. కానీ వారిని మించిన రాయల్ లైఫ్ ను అనుభవిస్తున్నారు. కోటాను కోట్ల ఆస్తికి అధిపతిగా రిచ్ లైఫ్ ను ఆస్వాదిస్తున్నారు.
ఆయనకు కింగ్ రామా ఎక్స్ అని కూడా పిలుస్తారు. రాజు తండ్రి 2016లో 88 ఏళ్ల వయసులో కనుమూశారు. 2019లో రాజుగా వజీరా లాంగ్ కొన్ పట్టాభిషిక్తులయ్యారు. కింగ్ ఆస్తి థాయ్ లాండ్ అంతటా విస్తరించి ఉంది. 16,000 ఎకరాల భూమి ఇంకా ఒక్క బ్యాంగ్ కాక్ లోనే 17,000 ప్రాపర్టీస్ ఉన్నాయి. అయితే తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన స్థలంలో మాల్స్, హోటల్స్ తో సహా అనేక భవనాలు నిర్మించి అద్దెకు ఇచ్చారు. పలు కంపెనీలు స్థాపించారు. కింగ్ కు థాయ్ సియామ్ బ్యాంక్ లో 23 శాతం, సియామ్ సిమెంట్ గ్రూప్ లో 33 శాతం వాటా ఉంది. థాయ్ రాజు కిరీటంలోని ఉన్న 545 క్యారెట్ల చూప్లి డైమండ్ అత్యంత అరుదైన ఖరీదైన వజ్రం. దీని విలువ దాదాపు 100 కోట్ల రూపాయలని అంటున్నారు. ఇక థాయ్ కింగ్ వద్ద బోయింగ్ ఎయిర్ బస్, సుఖోయ్ యుద్ధ విమానం, 201 హెలికాప్టర్లతో సహా 38 విమానాలు ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం
చిరుత పులిని వెంటపడి తరిమిన కుక్కలు వీడియో
సినిమాలో లెక్కనే వివాహ విందులో మహిళ రచ్చ రంబోలా వీడియో
షార్ట్ సర్క్యూట్ జరగకుండా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే : రిటైర్డ్ ADE తుల్జా రామ్ సింగ్ వీడియో

దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు

ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.

ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది

మీ ఇంటిలోకి పాములు వస్తాయని భయపడుతున్నారా? ఈ మొక్కలు నాటి చూడండి!

అద్దెకు పెళ్లి కుమార్తె.. ఇదో వింత మోసం..వీడియో

మేకప్ ప్రొడక్ట్స్తో బీ అలర్ట్..పాపం ఆ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్..

'పెళ్లి ఓ టైం వేస్ట్!' నాగరికతకు దూరంగా గుహలో నివాసం..
