Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరుత పులిని వెంటపడి తరిమిన కుక్కలు వీడియో

చిరుత పులిని వెంటపడి తరిమిన కుక్కలు వీడియో

Samatha J

|

Updated on: May 22, 2025 | 4:10 PM

ఈ వీరభూమిలో వేటకుక్కలను తరిమినా కుందేళ్ళు ఉన్నాయట అని వీరుల చరిత్ర గురించి చెప్పేటప్పుడు ఉదహరిస్తుంటారు. అంటే ఆ ప్రాంతంలోని మట్టికి, గాలికి, నీటికి కూడా వీరత్వం ఉందని చెప్పడానికి అన్నమాట. అయితే ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జరిగిన ఈ సంఘటన చూసాక నిజంగానే అక్కడ మట్టికి, గాలికి వీరత్వం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే చిరుతను చూస్తేనే ఆమడ దూరం పరిగెత్తే కుక్కలు ఏకంగా ఆ చిరుతనే పరిగెత్తించి పరిగెత్తించి తరిమాకి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో ప్రకారం వీధిలోని రోడ్డు పై ఒక కుక్క నిద్రపోతూ ఉంటుంది.

ఒక చిరుత మెల్లగా దాని వద్దకు వచ్చి దాడి చేసింది. కుక్క మెడను నోటకరిచి ఎత్తుకెళ్ళేందుకు ప్రయత్నించింది. ఇంతలో ఆ వీధిలోని మరికొన్ని కుక్కలు ఆ దృశ్యాన్ని చూసి అక్కడికి చేరుకున్నాయి. ఓ కుక్క ధైర్యం చేసి చిరుతపై దాడి చేసింది. ఈ టైంలో మరికొన్ని కుక్కలు గుంపుగా చిరుత మీద పడ్డాయి. దీంతో చిరుత అక్కడి నుంచి పారిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరాఖండ్ హరిద్వార్ లోని రాజాజీ టైగర్ రిజర్వ్ సరిహద్దులో ఉన్న బిహెచ్ యెల్ ప్రాంతంలో రాత్రివేళ జరిగింది ఈ ఘటన. అయితే చివరికి చిరుత పారిపోతూ ఓ కుక్క వెంటపడింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది స్పష్టత లేదు. ఓ ఇంటి వద్ద ఉన్న సిసిటివిలో ఈ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి.

మరిన్ని వీడియోల కోసం :

ఓల్డ్‌సిటీ అగ్నిప్రమాదంలో గుండెలు బద్దలయ్యే వివరాలు వీడియో

మూడో ప్రపంచయుద్ధమే వస్తే .. ఈ దేశాలు సేఫేనా?వీడియో

51 రోజులు.. 1,000 కి.మీ.. శ్రీలంక మీదుగా ఆంధ్రాకు వీడియో