Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడో ప్రపంచయుద్ధమే వస్తే .. ఈ దేశాలు సేఫేనా?వీడియో

మూడో ప్రపంచయుద్ధమే వస్తే .. ఈ దేశాలు సేఫేనా?వీడియో

Samatha J

|

Updated on: May 21, 2025 | 1:25 PM

రెండు ప్రపంచ యుద్ధాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయి. హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా జారవిడిచిన అణుబాంబులు దాదాపు రెండు లక్షలకు పైగా జపాన్ పౌరులను బలితీసుకున్నాయి. అప్పటికప్పుడు చాలామంది మరణిస్తే మిగిలిన వారంతా రేడియేషన్ ప్రభావానికి గురి ప్రాణాలు వెళ్ళించారు. 78 ఏళ్లు గడిచిన నేటికీ ఎంతోకొంత ప్రభావం చూపుతూనే ఉంటాయి. ప్రస్తుతం అనేక దేశాలు అణుబాంబులు కలిగి ఉంటాయి. అయితే జపాన్ బాంబు దాడికి సంబంధించి హృదయ విదారక దృశ్యాలు ఇప్పటికే కళ్లముందు కనిపిస్తూ ఉండటం వల్ల వాటిని ఉపయోగించడానికి ప్రభుత్వాలు ఇష్టపడటం లేదు. జపాన్ అణుయుద్ధాన్ని చూసిన వారు ఇప్పుడు దాదాపుగా ఎవరూ లేరు. అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఎక్కడో చోట ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో న్యూక్లియర్ వార్ భయాలు నెలకొన్నాయి.

ఒకవేళ అణుయుద్ధం సంభవించిన ఓ ఐదు నుంచి పది దేశాలు మాత్రం సురక్షితంగా ఉంటాయట. వాటి ప్రత్యేక భౌగోళిక స్థితి తటస్థ వైఖరితో అణుదాడి నుంచి తమ ప్రజలను రక్షించుకోగలవని అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచం అప్రకటిత మూడో ప్రపంచ యుద్ధంలోకి వెళ్లిపోయింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య బాంబుల మోతలు ఇంకా ఆలగానే ఉండగానే పశ్చిమాసియా రగులుతుంది. అంతకంతకు యుద్ధం విస్తరిస్తు పోతుంది. ఇజ్రాయిల్, ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి దిగాయి. ఇది పశ్చిమాసియా మొత్తాన్ని సర్వనాశనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుద్ధం వచ్చినా సేఫ్ గా ఉండే ప్రాంతాల్లో అంటార్కిటికా మొదటిది. కానీ అక్కడ బతకడానికి పెద్దగా అనువు కాదు. భూటాన్ కూడా సేఫ్ ప్లేస్ గా రక్షణ నిపుణులు నిర్ధారించారు. పూర్తిగా పర్వతాల్లో ఈ దేశం ఉంటుంది. ఆ తర్వాత దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ, ఫిజీ దేశాలు వాటికున్న భౌగోళిక అనుకూలతల వల్ల సేఫ్ ప్లేస్ లుగా ఉన్నాయి. ఇండోనేషియా, న్యూజిలాండ్ దేశాల్లోనూ హాయిగా బతకవచ్చు. ఇక స్విట్జర్లాండ్ ఎప్పుడూ ఎవరి పక్షం వహించకుండా తటస్థ విధానాన్ని పాటిస్తుంది.