Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షార్ట్ సర్క్యూట్ జరగకుండా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే : రిటైర్డ్ ADE తుల్జా రామ్ సింగ్ వీడియో

షార్ట్ సర్క్యూట్ జరగకుండా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే : రిటైర్డ్ ADE తుల్జా రామ్ సింగ్ వీడియో

Samatha J

|

Updated on: May 22, 2025 | 4:26 PM

ఓల్డ్ సిటీ అగ్నిప్రమాదంతో తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంటల్లో 17 మంది మృతి చెందడం యావత్ రాష్ట్రాన్ని విషాదంలోకి నెట్టింది. చిన్నారులు సైతం ప్రమాదంలో చనిపోవడం కలిచివేస్తుంది. ఓ వ్యాపారి ఇంట్లో ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కి కారణాలు ఏంటి? ఎర్తింగ్ అనేది చాలా ముఖ్యమైనదే. ప్రతి ఇంట్లో ఎర్తింగ్ సిస్టం కరెక్టుగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సరైన కెపాసిటీ గల ఎంసీబీలు పెట్టుకోవాలి. ఇంట్లో వినియోగించే కరెంటు లోడుకు సరిపోయే కేబుల్స్ వాడుతున్నామా లేదా చెక్ చేసుకోవాలి. ఓల్డ్ హౌస్ లో ఖచ్చితంగా వైరింగ్ సిస్టం ని చెక్ చేసుకోవాలంటున్న రిటైర్డ్ ఏడీఈ తులసారాం సింగ్ తో మా సీనియర్ కరస్పాండెంట్ వాసు ఫేస్ టు ఫేస్. వరుసగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.

 నిన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినట్టుగా ఫైర్ డిపార్ట్మెంట్ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. మరి ఇంకా ఎంక్వైరీ జరుగుతున్న పరిస్థితి ఉంది. అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్లు ఎట్లా జరుగుతాయని మనకు తెలిసి ఉండటానికి తులసారాం సింగ్ గారు రిటైర్డ్ ఏడీఈ మనతో ఉన్నారు. సార్ చెప్పండి. నిన్న చూశారు స్పష్టంగా. అంటే యాక్సిడెంట్ చాలా నిజంగా చాలా ఘోరం అని చెప్పుకోవాలి. అంటే అక్కడ ఒకేసారి ఒక రెసిడెన్షియల్ హౌస్ కి సంబంధించి ఏడు ఏసీలు ఒకేసారి ఆన్ చేశారు. కొన్ని కంప్రెసర్స్ పేలిపోయాయి అంటూ చెబుతున్నారు. అసలు ఈ కేబుల్ సిస్టం ఎట్లా ఉంటది? అసలు ఎట్లా యూనిట్ ఫర్ ఎట్లా ఉంటది? ఎట్లాంటి లోపల వైరింగ్ సిస్టం ఎట్లాంటివి వాడాల్సిన అవకాశం ఉంటుంది? అసలు విద్యుత్ అనేది చాలా సంక్లిష్టమైన వస్తువు అది. చాలా కాంప్లికేటెడ్ డైనమిక్ సబ్జెక్ట్ అది. ఎలక్ట్రిసిటీని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత ప్రయోజనకరంగా ఉంటది.

మరిన్ని వీడియోల కోసం :

ఓల్డ్‌సిటీ అగ్నిప్రమాదంలో గుండెలు బద్దలయ్యే వివరాలు వీడియో

మూడో ప్రపంచయుద్ధమే వస్తే .. ఈ దేశాలు సేఫేనా?వీడియో

51 రోజులు.. 1,000 కి.మీ.. శ్రీలంక మీదుగా ఆంధ్రాకు వీడియో