కాసేపట్లో అక్క పెళ్లి ఇంతలోనే ఆక్సిడెంట్‌లో తమ్ముడు వీడియో
తమ్ముడి మృతితో అక్క పెళ్లి ఆగిపోయిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. మరికొద్ది గంటల్లో కళ్యాణ తంతు నిర్వహించాల్సి ఉండగా ఇంతలోనే విషాదం. వధువు తమ్ముడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో అక్క వివాహం అర్థాంతరంగా నిలిచిపోయింది. శనివారం రాత్రి హులేబీడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అస్పరికి చెందిన ఆనంద్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో అతని స్నేహితులు పూర్ణచంద్ర, తిమ్మప్ప తీవ్రంగా గాయపడ్డారు. అస్పరికి చెందిన తిమ్మప్ప శకుంతల కుమారుడు ఆనంద్. కాగా అతని సోదరి వివాహం హొలగుండ మండలం వందవాగిలి గ్రామంలో ఆదివారం ఉదయం జరగాల్సి ఉంది. ఆనంద్, పూర్ణచంద్ర, తిమ్మప్ప గుంటూరులోని ఆర్విఐటి ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు.
పూర్ణచంద్ర స్వగ్రామం ప్రకాశం జిల్లా కంబం గ్రామం కాగా తిమ్మప్పది అస్పరి మండలం చిగిలి గ్రామం. శనివారం రాత్రి ఆనంద్ తన సోదరి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు బైక్ పై వెళుతుండగా కారు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆనంద్ మృతితో అతని సోదరి పెళ్లి ఆగిపోయింది. అక్క పెళ్లికి వచ్చి తమ్ముడి అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆనంద్ మృతి బాధాకరమని ఆలూరు ఎమ్మెల్యే బుసిని విరూపాక్షి అన్నారు. ఆదివారం ఆయన ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆనంద్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మరిన్ని వీడియోల కోసం :
ఓల్డ్‌సిటీ అగ్నిప్రమాదంలో గుండెలు బద్దలయ్యే వివరాలు వీడియో
మూడో ప్రపంచయుద్ధమే వస్తే .. ఈ దేశాలు సేఫేనా?వీడియో
51 రోజులు.. 1,000 కి.మీ.. శ్రీలంక మీదుగా ఆంధ్రాకు వీడియో
వైరల్ వీడియోలు

బైపాస్ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్

అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో

ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే

కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..

తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా

మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం

బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం.. చివరికి ?

విందులో మందు లేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్తులు వీడియో
Latest Videos