51 రోజులు.. 1,000 కి.మీ.. శ్రీలంక మీదుగా ఆంధ్రాకు
కాకినాడ తీరంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సందడిని చూస్తాం. అరుదైన జాతిగా గుర్తింపు పొందిన ఈ తాబేళ్లు గుడ్లు పెట్టడం కోసం కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఒడిశా, ఏపీ తీరాలకు చేరి గుడ్లు పెడతాయి. ఓ తాబేలు ఒడిశా తీరం నుంచి ప్రయాణం మొదలుపెట్టి 51 రోజుల తరువాత ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకుంది.
నువ్వా నేన్నా అన్నట్లు సాగుతున్న ఈ పోటీలో నాలుగేళ్ల కిందట ఒడిశా తీరంలో ట్యాగ్ వేసిన మరో తాబేలు ఏకంగా 3,500 కి.మీ. ప్రయాణించి ఇటీవల మహారాష్ట్రలోని రత్నగిరి తీరానికి వచ్చి చేరింది. అరుదైన జాతిగా గుర్తింపు పొందాయి ఆలివ్ రిడ్లీ తాబేళ్లు. ఇవి గుడ్లు పెట్టడం కోసం వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఒడిశాలోని కేంద్రపడ జిల్లా గహీర్‌మఠ్ వద్ద సముద్రంలో ప్రయాణం ప్రారంభించి 51 రోజుల తరువాత ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకుంది ఓ తాబేలు. ఇది వెయ్యి కిలోమీటర్లు ఈదినట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రేమ్‌శంకర్ ఝా తెలిపారు. ఆలివ్ రిడ్లీకి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ట్యాగ్ అమర్చి పరిశీలించగా ఈ విషయాలు తెలిసిందన్నారు. ఈ తాబేలు శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరిల మీదుగా ఆంధ్రాకు చేరిందని అన్నారు. నాలుగేళ్ల కిందట ఒడిశా తీరంలో ట్యాగ్ వేసిన మరో తాబేలు 3,500 కి.మీ. ప్రయాణించి గుడ్లు పెట్టేందుకు ఇటీవల మహారాష్ట్రలోని రత్నగిరి తీరానికి వచ్చినట్లు గుర్తించామని తెలిపారు. ఇటీవల కాకినాడ బీచ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి చెందుతుండడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. తాబేళ్ల సంరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్‌ని పవన్ ఆదేశించారు. అయితే బాపట్ల జిల్లా సూర్యలంకలో సైతం ఆలివ్ రిడ్లీ తాబేలు మృత్యువాత పడుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరుస హత్యలు.. గగుర్పొడిచే సన్నివేశాలు !! తప్పక చూడాల్సిన సిరీస్ ఇది
Hit 3: అప్పుడే OTTలోకి హిట్ 3.. ఎప్పుడంటే ??
నా భర్త గే.. అందరికీ షాకిచ్చు న్యూస్ చెప్పిన స్టార్
ఈ స్థాయికి రావడం గొప్పే అంటూ.. ట్రోలర్స్‌కు క్లాస్ పీకిన అక్క

‘మీ దేశానికి పో !’ యువతితో రాపిడో రైడర్.. దాడి కేసులో ట్విస్ట్

బిచ్చగాడినంటూ ఇంటికి వచ్చాడు.. ఆమె ఒంటరిగా కనిపించేసరికి..

అదనపు కట్నంగా .. కోడలిని ఏం అడిగారో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్

జంబో పుట్టగొడుగును ఎప్పుడైనా చూశారా ??

డబ్బులు లెక్కపెట్టుకుంటున్న వ్యక్తి.. ఇంతలో ఊహించని ట్విస్ట్

సొర చేపకు మహిళ ముద్దులు.. తర్వాత అంతా షాక్ వీడియో

ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన భక్తులు.. శివలింగంపై ఉన్నది చూసి షాక్
