Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాల్ కాబోయే భార్యను వేదికపైనే అవమానించిన స్టార్

విశాల్ కాబోయే భార్యను వేదికపైనే అవమానించిన స్టార్

Phani CH

|

Updated on: May 22, 2025 | 4:10 PM

యాక్షన్ హీరో విశాల్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. ఇప్పటికే విశాల్ పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్లి అని, ఈ హీరోయిన్ తో విశాల్ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఎట్టకేలకు ఇప్పుడు విశాల్ స్వయంగా తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేశారు. నటి సాయి ధన్సికను వివాహం చేసుకోనున్నాడు విశాల్.

ఇటీవలే చెన్నైలో జరిగిన ఓ సినిమా ఈవెంట్ లో తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు. ధన్సిక కూడా విశాల్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే విశాల్ కు కాబోయే భార్యను ఓ స్టార్ హీరో తండ్రి అవమానించాడు. దాంతో స్టేజ్ పైనే సాయి ధన్సిక కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతకూ ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే.. కోలీవుడ్ లో నటుడిగా,దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాదు ఆయన స్టార్ హీరో శింబు తండ్రి కూడా.. కానీ ఓ సందర్భంలో సాయి ధన్సిక పై ఆయన చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపాయి. సాయి ధన్సిక పై అణుచిత వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఆమె స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుంది. 2017లో విజితిరు అనే సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో కృష్ణ, విధర్త్‌ ప్రధాన పాత్రలో నటించారు. ఇదే సినిమాలో సాయి ధన్సిక, టి టి రాజేందర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రెస్ మీట్ లో టి రాజేందర్ చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఈ ప్రెస్ మీట్ లో సాయి ధన్సిక మాట్లాడుతూ.. స్టేజ్ పై ఉన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. అయితే టి రాజేందర్ పేరును మరిచిపోయింది. దాంతో ఆయన స్టేజ్ పైనే ఇష్టమొచ్చినట్టు ఆమెను తిట్టేశాడు. అదే సమయంలో ఆమె రజినీకాంత్ కబాలి సినిమా చేస్తుంది.. పెద్ద సినిమాలో నటిస్తున్నా అని ఆమెకు బాగా పొగరు పట్టిందని తిట్టేశాడు. అయితే తాను టి రాజేందర్ ను గౌరవిస్తాను అని పొరపాటున మర్చిపోయాను అని క్షమాపణలు చెప్పింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నన్నో తెలుగు స్టార్ డైరెక్టర్‌ రమ్మన్నాడు

జెట్ స్పీడ్‌లో అల్లు అర్జున్ రూ.800 కోట్ల సినిమా

క్రేజీగా.. కలర్‌ఫుల్‌గా ఉంది పాక్‌పై జ్యోతి మల్హోత్రా వర్ణన

జైలు గోడలెక్కిన పిల్లి.. పట్టుకున్న పోలీసులు షాక్‌