నన్నో తెలుగు స్టార్ డైరెక్టర్ రమ్మన్నాడు
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ అనేది చాలా పెద్ద సమస్య.. సినీ ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి వినిపిస్తున్న టాపిక్ క్యాస్టింగ్ కౌచ్. అయితే దీని పై చాలా మంది తమ అభిప్రాయాలను, చేదు అనుభవాలను కూడా పంచుకున్నారు. అయినప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఉందా లేదా అన్నది అనుమానంగానే ఉంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆ నిర్మాత ఇలా అని.. ఈ దర్శకుడు అలా అని చాలా మంది చెప్పుకొచ్చారు. సినిమా ఆఫర్స్ కోసం కమిట్‌మెంట్స్ అడుగుతారనే కామెంట్స్ రెగ్యులర్ గా వినిపిస్తుంటాయి. తాజాగా ఓ నటి కూడా క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. అదికూడా టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి షాకింగ్ విషయాన్నీ పంచుకుంది. తాజాగా హీరోయిన్ సయామీ ఖేర్ క్యాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ విషయం తెలిపింది. బాలీవుడ్ నటి సయామీ ఖేర్ తన 19 ఏళ్ల వయసులో తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక మహిళా క్యాస్టింగ్ ఏజెంట్ తనను ఒక తెలుగు సినిమా కోసం కాంప్రమైజ్ అవ్వమని కోరినట్లు వెల్లడించింది. ఈ ఘటన ఆమెను షాక్‌కు గురిచేసిందని, ఇండస్ట్రీపై నిరాశకు గురిచేసిందని తెలిపింది. ఈ విషయాన్ని ఆమె తన సన్నిహితులతో పంచుకున్నప్పటికీ, ఆ సమయంలో బయటపెట్టలేదు, బయట పెట్టె సాహసం చేయలేదని తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో వైరల్ అయ్యాయి. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యపై చర్చను రేకెత్తించాయి. అంతే కాదు ఓ టాలీవుడ్ దర్శకుడు కూడా తనను “కమిట్‌మెంట్” అడిగినట్లు పేర్కొంది, అయితే ఆ దర్శకుడి పేరును వెల్లడించలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జెట్ స్పీడ్‌లో అల్లు అర్జున్ రూ.800 కోట్ల సినిమా

విందులో మందు లేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్తులు వీడియో

జగిత్యాలలో ఎల్లో ఫ్రాగ్స్ కలకలం దేనికి సంకేతమో తెలుసా?వీడియో

వీడు మామూలోడు కాదు.. ప్రియురాలి కోసం.. వీడియో

వామ్మో.. అంతటి జెర్రిపోతును అమాంతం మింగేసిందిగా వీడియో

ఓర్నీ.. వధువుకి పువ్వు ఇవ్వడానికి వరుడు పడిన కష్టం చూస్తే నవ్వడమే

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..
