జెట్ స్పీడ్‌లో అల్లు అర్జున్ రూ.800 కోట్ల సినిమా
ఐకాన్‌స్టార్, అల్లు అర్జున్, పాన్ ఇండియా సూపర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సెన్సేషనల్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ కాంబో కోసం భారతదేశ సినీ ప్రేమికులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎదురుచూశారు. ఈ సన్సేషనల్ కాంబినేషన్ సినిమాను స్టార్ డైరెక్టర్ అట్లీ ఫస్ట్ తెలుగు సినిమా ఇది.
ఇండియన్ సినిమా పరిశ్రమలొ నూతన ఉత్తేజాన్ని నింపిన ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ ఎంటర్టైన్‌మెంట్ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ రూపొందిస్తున్నాడు. లాస్ ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా హీరో అల్లు అర్జున్, హాలీవుడ్ టెక్నిషియన్స్, దర్శకుడు అట్లీలపై చిత్రీకరించిన ఓ ప్రత్యేక వీడియో ద్వారా ఈ అనౌన్స్ అయింది. అయితే ఇప్పటివరకు టైటిల్ ఖరారు కాని ఈ పాన్-ఇండియా చిత్రంతో ముగ్గురు స్టార్స్ ఏకమవుతున్నారు. వారిలో ఒకరు భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు అట్లీ ఇంకొకరు పుష్ప చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించి, ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పురస్కారం పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక మూడవ వ్యక్తి భారతదేశంలోని అగ్రగణ్య మీడియా సంస్థలలో ఒకటైన సన్ టీవీ నెట్‌వర్క్‌కు చెందిన సన్ పిక్చర్స్. అయితే గత కొన్ని రోజులుగా ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వీంగ్‌లో ఉంది.జెట్ స్పీడ్‌లో ఈ సినిమా షూటింగ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో భాగంగా దర్శకుడు అట్లీ బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయన హైదరాబాద్‌లో ఐకాన్‌స్టార్‌ను కలిసి ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ సంబంధించిన చర్చల్లో పాల్గొనబోతున్నారు.అంతేకాదు ఈసినిమా జూన్‌లో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని న్యూస్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

