ఈ స్థాయికి రావడం గొప్పే అంటూ.. ట్రోలర్స్‌కు క్లాస్ పీకిన అక్క
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను షేక్ చేసిన వాటిలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఒకటి. ఈ పచ్చళ్ళ పంచాయితీ పై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఒకటే ఆడియో, ఒకటే ట్రోల్స్.. ఎవరు చూసిన అలేఖ్య చిట్టిపికిల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు.
నెటిజన్స్ దగ్గర నుంచి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల వరకూ అందరూ అలేఖ్య చిట్టి పికిల్స్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పచ్చళ్లు బిజినెస్ చేస్తూ పాపులర్ అయిన ఈ అక్క చెల్లెళ్లు. సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫాలోవర్స్ ను పెంచుకున్నారు. అయితే వీరిలో ఒకరైన రమ్య రీల్స్ తో పాపులర్. ఇన్ స్టాగ్రామ్ లో క్రేజీ రీల్స్ చేస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. హాట్ హాట్ గా రీల్స్ చేస్తూ ఫాలోవర్స్ ను ఆకట్టుకుంది రమ్య. ఇప్పుడు ఈ చిన్నది సినిమాల్లో ఛాన్స్ అందుకుంది. రీసెంట్ గా ఓ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో రమ్య కనిపించింది. దాంతో కొంతమంది ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. అయితే తమ సిస్టర్ ను ట్రోల్ చేస్తున్న వారి పై పికిల్ సిస్టర్స్ లో ఒకరైన సుమ ఫైర్ అయ్యింది. తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. “ఏంటి మీ చెల్లి స్టేజ్ మీద నిలబడినందుకే అంత హ్యాపీగా ఉందా.? అని మీరు అనుకోవచ్చు.. కానీ తాను ఎంత కష్టపడిందో మీకు తెలియదు. మేము చాలా నార్మల్ పీపుల్.. తాను ఆ స్థాయికి రావడం చాలా గొప్ప విషయం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏం కష్టపడింది.? వీడియోలే కదా చేసింది అని మీరు అనోకోవచ్చు.. కానీ ఎన్ని ఆడిషన్స్ ఇచ్చిందో మీకు తెలియదు. అసలు నేను చేయగలనా అని ఆలోచించింది.. ఓ టైం లో డిప్రషన్ లోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ స్టేజ్ వరకు వెళ్ళిందంటే క్రెడిట్ మొత్తం రమ్యకే అని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. తన ఈ వీడియోతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది ఈమె.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విశాల్ కాబోయే భార్యను వేదికపైనే అవమానించిన స్టార్
నన్నో తెలుగు స్టార్ డైరెక్టర్ రమ్మన్నాడు
జెట్ స్పీడ్‌లో అల్లు అర్జున్ రూ.800 కోట్ల సినిమా

‘మీ దేశానికి పో !’ యువతితో రాపిడో రైడర్.. దాడి కేసులో ట్విస్ట్

బిచ్చగాడినంటూ ఇంటికి వచ్చాడు.. ఆమె ఒంటరిగా కనిపించేసరికి..

అదనపు కట్నంగా .. కోడలిని ఏం అడిగారో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్

జంబో పుట్టగొడుగును ఎప్పుడైనా చూశారా ??

డబ్బులు లెక్కపెట్టుకుంటున్న వ్యక్తి.. ఇంతలో ఊహించని ట్విస్ట్

సొర చేపకు మహిళ ముద్దులు.. తర్వాత అంతా షాక్ వీడియో

ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన భక్తులు.. శివలింగంపై ఉన్నది చూసి షాక్
