Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hit 3: అప్పుడే OTTలోకి హిట్ 3.. ఎప్పుడంటే ??

Hit 3: అప్పుడే OTTలోకి హిట్ 3.. ఎప్పుడంటే ??

Phani CH

|

Updated on: May 22, 2025 | 4:23 PM

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా హిట్-3: ది థర్డ్‌ కేస్‌. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. వాల్‌పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేని, నానిలు హిట్ 3 చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ కు ముందే పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్ ఓ రేంజ్ లో ఉండడం, ప్రమోషన్లు గట్టిగా నిర్వహించడంతో హిట్-3 అంచనాలు అమాంతం పెరిగిపోయాయి..

అందుకు తగ్గట్టుగానే మేడే కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. నాని గత సినిమాలతో పోల్చితే ఇందులో రక్త పాతం, హింస ఎక్కువైందని విమర్శలు వచ్చినా ఆడియెన్స్ కు హిట్-3 సినిమా బాగా ఎక్కేసింది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్లు వంద కోట్లు దాటేశాయి. అలాగే రిలీజై మూడు వారాలు గడిచినా చాలా చోట్ల ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అదే సమయంలో హిట్-3 సినిమా ఓటీటీ రిలీజ్ పై నెట్టింట ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హిట్-3 మూవీ ఓటీటీ డేట్ లాక్ అయిందని ప్రచారం జరుగుతోంది. హిట్-3 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇందుకోసం రూ. 50 కోట్లకు పైగానే చిత్ర బృందానికి చెల్లించినట్లు సమాచారం. థియేటర్‌లో రిలీజైన ఐదు వారాల తర్వాత హిట్-3 సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని ఒప్పందం కూడా జరిగినట్లు సమాచారం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నా భర్త గే.. అందరికీ షాకిచ్చు న్యూస్ చెప్పిన స్టార్

ఈ స్థాయికి రావడం గొప్పే అంటూ.. ట్రోలర్స్‌కు క్లాస్‌ పీకిన అక్క

విశాల్ కాబోయే భార్యను వేదికపైనే అవమానించిన స్టార్

నన్నో తెలుగు స్టార్ డైరెక్టర్‌ రమ్మన్నాడు

జెట్ స్పీడ్‌లో అల్లు అర్జున్ రూ.800 కోట్ల సినిమా