వరుస హత్యలు.. గగుర్పొడిచే సన్నివేశాలు !! తప్పక చూడాల్సిన సిరీస్ ఇది
సాధారణంగా థ్రిల్లర్, హారర్ సినిమాలు ఒంటరిగా చూడాలంటే చాలా మందికి భయం. కానీ ఈమధ్యకాలంలో ఓటీటీల్లో ఇలాంటి జానర్ సినిమాలు, వెబ్ సిరీస్ చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈమధ్య కాలంలో హారర్, మిస్టరీ, థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సిరీస్ క్షణ క్షణం మీకు భయం పుట్టిస్తుంది.
ఆద్యంతం ఉత్కంఠతో సాగే ఈ సిరీస్ మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ ప్రేక్షకులకు గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఇది ఒక సీరియల్ కిల్లర్ కథ. నిజమైన సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ సిరీస్ ప్రతి సినీప్రియుడిని కట్టిపడేస్తుంది. అదే ఆటో శంకర్. సీరియల్ కిల్లర్ గౌరీ శంకర్ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్ ఇప్పుడు హర్రర్ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. 1970 నుంచి 1980 వరకు చెన్నైలో మొత్తం 18 మంది అమాయకుల ప్రాణాలను తీశాడు. వరుస హత్యలతో చెన్నై ఊలిక్కిపడుతుంది. సజావుగా సాగుతున్న చెన్నై ప్రజల జీవితాల్లో ఈ సీరియల్ కిల్లర్ హత్యలు భయాన్ని కలిగిస్తాయి. ఈ హత్యల వెనుక శంకర్ ఉన్నాడని అనుమానిస్తుంటారు. అతడు నేరాలకు కేరాఫ్ అడ్రస్. అతడిని పోలీసులు ఎలా పట్టుకుంటారు.. ? ఆ హత్యలు శంకర్ ఎందుకు చేశాడు ? అనేది సినిమా. ఇందులో ఆటో శంకర్ పాత్రలో అప్పని శరత్ పోషించారు. ప్రతి క్షణం ప్రేక్షకులకు భయాన్ని పుట్టిస్తోంది ఈ సిరీస్. ఆటో శంకర్.. అప్పట్లో చెన్నైని హడలెత్తించిన సీరియల్ కిల్లర్. ఎంతో మంది అమాయకుల ప్రాణాలను తీసిన ఆటో శంకర్ అంటే అప్పట్లో జనాలు భయంతో వణికిపోయేవారు. అతడి జీవితం ఆధారంగా తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఇది. ప్రస్తుతం ఈ సిరీస్ కు ఐఎండీబీలో 6.7 రేటింగ్ కలిగి ఉంది. ఈ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు సస్పెన్స్, థ్రిల్లర్, నిజమైన క్రైమ్ కథలను చూడాలనుకుంటే ఈ సిరీస్ జీ5లో చూడొచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hit 3: అప్పుడే OTTలోకి హిట్ 3.. ఎప్పుడంటే ??
నా భర్త గే.. అందరికీ షాకిచ్చు న్యూస్ చెప్పిన స్టార్
ఈ స్థాయికి రావడం గొప్పే అంటూ.. ట్రోలర్స్‌కు క్లాస్ పీకిన అక్క

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..

ఎవరెస్ట్ శిఖరం వద్ద కింగ్ కోబ్రాస్ కలకలం! ప్రమాదపు అంచున ఉన్నామా.

కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్

ఒకే గుంతలో పులి, కుక్క.. తర్వాత ఏం జరిగిందంటే..

కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో

ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
