ఆ వస్తువు కారణంగా.. విమానం ఎక్కకుండా ఆపిన సిబ్బంది వీడియో
డాక్టర్ వద్ద సాటిలైట్ ఫోన్ ను ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. దాంతో విమానం ఎక్కకుండా ఆమెను నిలువరించారు. భారత్ లో నిషేధించిన సాటిలైట్ ఫోన్ ను ఆ డాక్టర్ కలిగి ఉండటం పై పోలీసులకు సమాచారం ఇచ్చారు. అమెరికాకు చెందిన రాచెల్ అనే స్కాట్ అనే కంటి వైద్యురాలు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని అరవింద్ కంటి ఆసుపత్రిని సందర్శించడానికి అక్కడికి వెళ్ళింది. అనంతరం హైదరాబాద్ కు వెళ్ళేందుకు పుదుచ్చేరి ఎయిర్ పోర్టుకు రాచెల్ అనే స్కాట్ చేరుకుంది.
తనకి ఈ సందర్భంగా అమెరికా డాక్టర్ వద్ద ఇరిడియం సాటిలైట్ ఫోన్ ఉన్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. విమానం ఎక్కకుండా ఆమెను నిలువరించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ రాచెల్ అనే స్కాట్ తమిళనాడులోని మదురైతో పాటు మరికొన్ని ప్రాంతాలను సందర్శించినట్లు తెలుసుకున్నారు. తురయా ఇరిడియం వంటి ఉపగ్రహ ఫోన్ లను ముందస్తు అనుమతి లేకుండా భారత్ లో వినియోగించడాన్ని టెలికమ్యూనికేషన్ శాఖ నిషేధించింది. ఈ నిషేధం గురించి ప్రకటించాలని విదేశీ కార్యాలయాలు విమాన మ్యాగజైన్ ద్వారా ప్రయాణికులకు తెలియచేయాలని డిజిసిఏ ఆదేశించింది. ఇటీవల సాటిలైట్ ఫోన్ లు కలిగిన అమెరికా జాతీయులను దెహ్రాదున్ చెన్నై విమానాశ్రయాల్లో అరెస్ట్ చేశారు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
