పవన్ ఎఫెక్ట్.. రామ్ చరణ్, సుక్కు సినిమాకు బ్రేక్ వీడియో
గేమ్ చేంజర్ తో నిరాశ పరిచిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీతో అభిమానుల ఆకలి తీర్చాలని కష్టపడుతున్నారు. అందుకే బుజ్జి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ద ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రంగస్థలం కన్నా బాగుంటుందని హామీ ఇస్తున్నారు చరణ్. పెద్ద తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు చరణ్.
చాలా రోజుల క్రిందటే ఈ ప్రాజెక్ట్ లాక్ అయ్యింది. రంగస్థలం తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతూ ఉండటంతో మంచి బజ్ క్రియేట్ చేసింది కూడా. కానీ ఇప్పుడు సుకు కన్నా ముందు మరో దర్శకుడికి ఛాన్స్ ఇవ్వబోతున్నారు మెగా పవర్ స్టార్. పెద్ద పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు రామ్ చరణ్. త్రివిక్రమ్ కు అత్యంత సన్నిహితుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టును సెట్ చేశారు. అందుకే చరణ్ కూడా ప్రాజెక్టును పక్కన పెట్టి త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రామ్ చరణ్ సుకు సినిమాకు బ్రేక్ ఇచ్చినట్లు ఓ టాక్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. సుకు సినిమా కంటే ముందు త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

