Lychee Fruits: లీచీ ఇలా తిన్నారంటే అసలుకే ఎసరు ఖాయం..! ఖాళీ కడుపుతో అస్సలొద్దు..
అందరికీ ఇష్టమైన వేసవి పండు లిచీ. తియ్యగా, జ్యూసీగా ఉండే ఈ పండు దాదాపు అందరికీ ఇష్టమైనదే. అందుకే లిచీకి డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. లిచీ తినడానికి మాత్రమే మంచిది కాదు. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ లిచీ ప్రయోజనాలు దానిని ఎప్పుడు, ఎలా తింటారనే దానిపై ఆధారపడి ఉంటుంది..
Updated on: May 25, 2025 | 6:04 AM

లిచీ తినడం వల్ల మీ చర్మం మెరుస్తుంది. ఇది చర్మానికి మేలు చేసే ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. అయితే సరైన సమయంలో, సరైన మోతాదులో తీసుకుంటేనే ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. లేకపోతే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ఎట్టిపరిస్తితుల్లోనూ ఖాళీ కడుపుతో లిచీ తింటారు.

లిచీలో 82 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. వేసవిలో దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి, చర్మానికి కూడా అనేక ప్రయోజనకరంగా ఉంటుంది. లిచీలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, ప్రోటీన్, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

లిచీ తినడం వల్ల చర్మం మెరుపు సంతరించుకుంటుంది. ఇది చర్మానికి కూడా మేలు చేసే ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. అయితే దీనిని సరైన సమయంలో తీసుకుంటేనే ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. లేకపోతే అది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

కానీ ఖాళీ కడుపుతో తినడం వల్ల శరీరానికి పూర్తి పోషకాలు లభించవు. నిపుణుల అభిప్రాయం ప్రకారం లిచీని అల్పాహారం తీసుకున్న 1 గంట తర్వాత లేదా భోజనానికి 1-2 గంటల ముందు తినాలి. ఇలా తీసుకుంటే ప్రయోజనాలను రెట్టింపు చేస్తుంది.

లీచీలు తీపిగా, జ్యూసీగా, ఎరుపు రంగులో భలే రుచికరంగా ఉంటాయి. అందుకే కొంతమంది ఒకేసారి ఎక్కువ లీచీలను తింటారు. కానీ ఆ తర్వాత మలబద్ధకం, ఆమ్లత్వం, అజీర్ణం వంటి కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. అందువల్ల రోజుకు 10-15 లిచీల కంటే ఎక్కువ తినకూడదు.



















