Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయం నిద్ర లేవగానే వీటిని అస్సలు చూడకండి.. చూశారా ఇక మీకు రోజంతా బ్యాడ్ డే నే..!

జ్యోతిశాస్త్రం ప్రకారం ఉదయం నిద్రలేచిన వెంటనే చేయకూడని పనులు, చూడ కూడని వస్తువులు కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉద‌యం నిద్ర‌లేవ‌గానే కొన్ని వ‌స్తువుల‌ను చూస్తే ఆ రోజంతా అశుభంగా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అందుకే మీరు మీ రోజు ప్రారంభించే ముందు ఏయే పనులు చేయాలి..? ఎలాంటి వస్తువులను చూడాలో ఇక్కడ తెలుసుకుందాం...

ఉదయం నిద్ర లేవగానే వీటిని అస్సలు చూడకండి.. చూశారా ఇక మీకు రోజంతా బ్యాడ్ డే నే..!
Astro Tips
Jyothi Gadda
|

Updated on: May 23, 2025 | 9:30 PM

Share

హిందూ మతంలో వాస్తు, జ్యోతిష్యానికి ప్రత్యేక ప్రముఖ్యత ఉంది. వాస్తు ప్రకారం..ఇంటి నిర్మాణం నుండి వంట, భోజనం చేసి ప్రదేశం, పని ప్రదేశం, సరైన నిద్ర కోసం సరైన దిశను ఎంచుకోవాలని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే, జ్యోతిశాస్త్రం ప్రకారం ఉదయం నిద్రలేచిన వెంటనే చేయకూడని పనులు, చూడ కూడని వస్తువులు కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉద‌యం నిద్ర‌లేవ‌గానే కొన్ని వ‌స్తువుల‌ను చూస్తే ఆ రోజంతా అశుభంగా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అందుకే మీరు మీ రోజు ప్రారంభించే ముందు ఏయే పనులు చేయాలి..? ఎలాంటి వస్తువులను చూడాలో ఇక్కడ తెలుసుకుందాం…

ఉదయం నిద్రలేవగానే ఆగిపోయిన గ‌డియారాన్ని చూడ‌కూడ‌ద‌ని వాస్తు శాస్త్రంలో చెప్ప‌బ‌డింది. దీనివ‌ల‌్ల రోజంతా మీకు నెగిటివ్ ఎన‌ర్జీ పెరుగుతుందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఉద‌యం నిద్రలేచి క‌ళ్లు తెరిచిన వెంట‌నే అద్దం చూడ‌టం వ‌ల‌్ల కూడా అశుభం క‌లుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే చాలామంది బెడ్‌రూమ్‌లో అద్దం పెట్టుకోరని చెబుతున్నారు. అలాగే, నిద్ర‌లేస్తూనే మ‌న నీడ‌ను మ‌నం చూడ‌టం కూడా అన‌ర్థాల‌కు దారితీస్తుంది. దీనివ‌ల‌్ల ప్ర‌తికూల శ‌క్తి ఇంట్లోకి ప్ర‌వేశిస్తుంది.

అలాగే, ఉద‌యం నిద్ర‌లేచిన వెంట‌నే చెత్త‌ బుట్ట‌ను కూడా చూడ‌కూడ‌దు. చెత్త‌బుట్ట‌ను చూస్తే రోజంతా ప‌లు స‌మ‌స్య‌లు వెంటాడుతాయ‌ని వాస్తు పండితులు హెచ్చ‌రిస్తున్నారు. రాత్రి తిన్న తర్వాత క‌డ‌గ‌కుండా ఉండే పాత్ర‌ల‌ను నిద్ర‌లేవ‌గానే చూడ‌కూడ‌దు. అందుకే రాత్రి లేట్ అయిన పాత్ర‌ల‌ను క్లీన్ చేసుకోవాలని చెబుతున్నారు. విరిగిన దేవత విగ్రహాలను చూడడం కూడా మంచిది కాదు. దీనివ‌ల‌్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ‌వుతాయి.

ఇవి కూడా చదవండి

ఉద‌యం నిద్ర‌లేచిన వెంట‌నే వన్యప్రాణుల చిత్రాలను చూడడం కూడా వాస్తు ప్రకారం అనర్ధాలకు దారితీస్తుందని చెబుతున్నారు. అలాగే, ఉద‌యం నిద్ర‌లేవ‌గానే సూది, దారం కూడా చూడ‌కూడ‌దు. దీనివ‌ల‌్ల మీ రోజువారి ప‌నుల‌లో ఆటంకాలు ఎదుర‌వుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..