AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒత్తైన జుట్టు కోసం బెండకాయ నీళ్లు.. ఇలా వాడితే డాండ్రఫ్‌ ఫ్రీ పక్కా..!

మార్కెట్లో మనకు అనేక రకాల కూరగాయలు కనిపిస్తాయి. కొందరు కొన్ని కొన్ని కూరగాయలను ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ, అన్ని కూరగాయల్లో కెల్లా బెండకాయను ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. ఈ బెండకాయతో రకరకాల వంటకాలు తయారు చేస్తుంటారు. బెండకాయ కేవలం రుచికి మాత్రమే కాదు.. బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కలిగిఉందని నిపుణులు చెబుతున్నారు. బెండకాయలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బెండకాయను ఫ్రై, కూర, పులుసుగా తీసుకుంటుంటారు. కానీ, బెండ‌కాయ‌ల‌తో నీళ్ల‌ను త‌యారు చేసి తాగుతారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసా? ఈ నీటిని తీసుకోవటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం...

Jyothi Gadda
|

Updated on: May 23, 2025 | 9:13 PM

Share
Okra Water

Okra Water

1 / 5
బెండకాయల్లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ కె, కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ సి, విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటాయి. మలబద్ధకంతో బాధపడేవారికి ఈ నీళ్లు మ్యాజిక్ టానిక్ మాదిరి పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.

2 / 5
తల తేమగా ఉండేలా చేస్తుంది, చుండ్రు లాంటి వాటిని కూడా తగ్గిస్తుంది. ఇది తరచుగా వాడటం వల్ల..జుట్టు నల్లగా, మృదువుగా మారుతుంది. 5 బెండకాయలను ముక్కలుగా కట్ చేసి రాత్రంతా నీటిలో ఉంచాలి. ఉదయాన్నే ఆ నీటిని తలపై రాసి 20 నిమిషాల తర్వాత తల కడగాలి.

3 / 5
బెండకాయ నీరు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ఇందులోని విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి.
బెండకాయలోని కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ K తదితర పోషకాలు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

బెండకాయ నీరు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ఇందులోని విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. బెండకాయలోని కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ K తదితర పోషకాలు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

4 / 5
బెండకాయ నీటిలోని లుటీన్, జియాజంతిన్ వంటి పోషకాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. బెండకాయలోని విటమిన్లు A, C, K తదితరాలు.. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అలాగే హార్మోన్లను నియంత్రించడం, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సాయం చేస్తాయి.

5 / 5
Follow Us