మీ పుట్టిన తేదీ 6 నుంచి 9లో ఉందా.. అయితే మీ జీవితంలో జరిగే అద్భుతాలు ఇవే !
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీలోని అంకెలను అన్నీ కలుపుతే వచ్చే సంఖ్యను బట్టి ఆ వ్యక్తి లక్షణాలను, తన జీవితంలో జరిగే మంచి చెడులు, జయాలు, అపజయాలు, ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఇలా చాలా విషయాల గురించి తెలుసుకోవచ్చు అంటారు. కాగా, మనం ఇప్పుడు ఆరో తేదీ నుంచి తొమ్మిదొవ తేదీ వరకు పుట్టిన వారి వ్యక్తిత్వం గురించి వివరంగా తెలుసుకుందాం.
Updated on: May 24, 2025 | 4:38 PM

సంఖ్యా శాస్త్రం ప్రకారం..ఆరో తేదీలో పుట్టిన వారు చాలా వరకు అందంగా కనిపిస్తారు. మంచి కళ ఉంటుంది. వీరు నాయకులుగా ఎదిగే లక్షణాలను ఉంటారంట. అంతే కాకుండా వీరు చాలా ధైర్యంగల వ్యక్తులంటున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. వీరు కొన్ని సార్లు మొండిగా ప్రవర్తిస్తారంట. అలాగే,వీరికి జాలి గుణం ఎక్కువ.

సంఖ్యాశాస్త్రం ప్రకారం..ఏడోవ తేదీన జన్మించిన వారు చాలా మంచి మనసున్న వ్యక్తులు. వీరు చాలా సున్నితంగా ఉంటారు. అందంగా కూడా ఉంటారు. అంతే కాకుండా ఏడో తేదీన పుట్టిన వారు ఎప్పుడూ శాంతిగా, ఆనందంగా ఉండటానికి ఇష్టపడుతారు. వీరికి అస్సలే స్వార్థం ఉండదు. ఇతరులపై ఆధారపడటానికి ఇష్టపడరు.

8వ తేదీన పుట్టిన వారు ఉన్నత చదువులు చదువుతారు. వీరికి కళరంగంలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ ఉన్నతంగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతారు. ఈ తేదీన జన్మించిన వారు తమ కుటుంబానికి మంచి ప్రాముఖ్యతనిస్తారు. కానీ కొన్ని సార్లు క్రమశిక్షణతో మెదలరు.

9వ తేదీన జన్మించిన వారు చాలా స్వార్థపరులు. కానీ వీరు ఎక్కువగా కష్టపడుతారు. అందరితో కలివిడిగా ఉంటారు. మంచి మనసు ఉంటుంది. అలాగే వీరికి బాధ్యత కూడా చాలా ఎక్కువే ఉంటుంది. వీరు తమ స్నేహితులకు, బంధువులకు మంచి ప్రియారిటీ ఇస్తారు.

10వ తేదీన జన్మించిన వారు చాలా మొండితనం ఉన్న వ్యక్తులు. అందరితో త్వరగా కలవరు. ఎప్పుడూ సింగిల్ గా ఉండటానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మంచి తెలివి తేటలు ఉంటాయి. కానీ వాటిని ఉపయోగించుకోవడంలో విఫలం అవుతారు. కొన్ని సార్లు అబద్ధాలు చెప్పడంలో కూడా ముందుంటారు.



