బీర్, విస్కీ తాగుతూ ఇలాంటి ఫుడ్ తింటున్నారా..? అయితే, మీ ఆరోగ్యానికి యమ డేంజర్..
మద్యం తాగుతూ ఏదో ఒక మంచింగ్ తీసుకోవటం కూడా దాదాపు అందరూ చేస్తుంటారు. అలా తాగుతున్న సమయంలో తినకూడని ఆహారాలు తినడం వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు.. అయితే, మద్యం తాగుతూ కొన్ని ఆహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మద్యం తాగేటప్పుడు మంచింగ్‌లో ఎలాంటి పదార్థాలు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రస్తుత రోజుల్లో మద్యం అలవాటు ఒక స్టేటస్ సింబల్‌గా భావిస్తుటారు చాలా మంది. పార్టీలు, విందు, వినోదం, విషాదం సందర్భం ఏదైనా సరే..ముందు మందు ఉండాల్సిందే. మద్యం అలవాటు అనేది ఇప్పుడు చాలా మందికి ఒక సాధారణ అలవాటుగా మారిపోయింది. అయితే, మద్యం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. అయినా చాలా మంది దీనికి బానిసలుగా మారుతున్నారు. ఇకపోతే, మద్యం తాగుతూ ఏదో ఒక మంచింగ్ తీసుకోవటం కూడా దాదాపు అందరూ చేస్తుంటారు. అలా తాగుతున్న సమయంలో తినకూడని ఆహారాలు తినడం వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు.. అయితే, మద్యం తాగుతూ కొన్ని ఆహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మద్యం తాగేటప్పుడు మంచింగ్‌లో ఎలాంటి పదార్థాలు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం..
మద్యం సేవించే సమయంలో కొందరు పాలు తాగుతూ ఉంటారు. నిజానికి ఇలా చేయడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరికొంతమంది పాలతో తయారు చేసిన పదార్థాలను కూడా తింటూ ఉంటారు. ఇలాంటివి తినడం కూడా ఆరోగ్యానికి మంచికాదని నిపుణులు చెబుతున్నారు. మద్యం తాగుతున్న సమయంలో ఇలాంటివి తినటం మానుకోవాలని చెబుతున్నారు. అలాగే, మద్యం తాగేటప్పుడు, ద్రాక్ష పండ్లను కూడా అస్సలు తినవద్దు అని చెబుతున్నారు.
మద్యం తాగుతూ ఎట్టి పరిస్థితుల్లో జీడిపప్పుతో తయారుచేసిన ఆహారాలు, వేరుశనగలను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇలాంటివి తినడం వల్ల గ్యాస్టిక్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. మరి కొంతమంది అయితే మందు తాగే క్రమంలో వేయించిన ఆహారాలు కూడా తీసుకుంటూ ఉంటారు.. ఇలాంటి ఆహారాల వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు మందు తాగే వారు తప్పకుండా వీటిని దృష్టిలో పెట్టుకొని తినకుండా ఉండడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








