Health Tips: రాత్రిపూట ఈ పదార్థాలు తినడం మంచిదేనా.. సరైన సమయం ఏంటో తెలుసా?
కీరదోసకాయ తిన్న వెంటనే నీళ్లు తాగకండి. కీరదోసకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది.
కీర దోసకాయ శరీరంలో వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఊబకాయంతో బాధపడేవారికి కీరదోస మంచి ఔషధంలా పనిచేస్తుందని తెలిసిందే. అంతేకాదు డయాబెటిస్‌ను కూడా నియంత్రణలో ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో చక్కర నిల్వలను తగ్గించి షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. అందువల్ల షుగర్ ఉన్న వారు ఎక్కువగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. కీరదోసలో మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్ వంటి విటమిన్లు ఎన్నో ఉన్నాయి. వీటిని తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కూడా కరిగిపోతాయి. అలాగే మూత్ర సమస్యలు తగ్గడంలో కీలకంగా పనిచేస్తాయి. కీరదోసలో కాన్సర్ ను నిరోధించే గుణాలు సైతం ఉన్నాయి. మొత్తంగా కీరదోసల్లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తినడం వల్ల పలు జబ్బులు సులభంగా నయమవుతాయి. అందుకే వీటిని ఎక్కువగా సలాడ్స్‌లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా స్నాక్స్ లా తింటుంటారు. ఈ కీర దోస ఉపయోగాలను ఇప్పుడు తెలుసుకుందాం.
- కీరదోసలో ఉండే విటమిన్లు బ్లడ్ ప్రెజర్‌ను తగ్గించి.. రక్త ప్రసరణ మంగా జరిగేలా సహకరిస్తాయి.
- చాలా మంది రాత్రిపూట కూడా కీరదోసకాయ తీసుకుంటారు. కానీ, అదే సమయంలో కొందరు మాత్రం రాత్రిపూట తినకుండా ఉంటారు. అయితే నిజంగా రాత్రిపూట కీరదోసకాయ తినాలా వద్దా? ఇప్పుడు తెలుసుకుందాం.
- రాత్రిపూట కీరదోసకాయ తింటే పొట్ట బరువుగా అనిపిస్తుంది. అందువల్ల, నిద్రించడానికి 3 గంటల ముందు రాత్రి భోజనం చేయడానికి ప్రయత్నించండి.
- రాత్రిపూట తినే భారీ ఆహారం మీ నిద్రను పాడు చేస్తుంది. రాత్రి 7 తర్వాత పిండి పదార్ధాలు తినకూడని కారణం ఇదే.
- సెన్సిటివ్ పొట్ట ఉన్నవారికి కీరదోసకాయ మంచి ఎంపిక కాదు. ఇది కుకుర్బిటాసిన్ అనే మూలకాన్ని కలిగి ఉంటుంది. ఇది శక్తివంతమైన పదార్ధం. దీని వల్ల అజీర్తి సమస్య రావొచ్చు.
- కీరదోసకాయ తిన్న వెంటనే నీళ్లు తాగకండి. కీరదోసకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కీరదోసకాయ తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. దీనివల్ల పోషకాలు కూడా తగ్గుతాయి.
- ఆహారం తినడానికి 30 నిమిషాల ముందు కీరదోసకాయను తీసుకోండి. ఇది శరీరానికి మరింత ప్రయోజనాన్ని ఇస్తుంది.
ఇవి కూడా చదవండి
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సలహాలుగా మాత్రమే తీసుకోవాలి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు, వైద్యుడిని సంప్రదించండి.