IPL 2022 Final: ఐపీఎల్ 2022లో రికార్డుల రారాజుగా రాజస్థాన్ ప్లేయర్.. ఏ బ్యాట్స్‌మెన్‌కు సాధ్యంకాని ఆ స్పెషల్ ఫీట్ ఏంటంటే?

రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ఇంగ్లీష్ ఓపెనర్ జోస్ బట్లర్ ఈ సీజన్‌లో తన ఐపీఎల్ కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

IPL 2022 Final: ఐపీఎల్ 2022లో రికార్డుల రారాజుగా రాజస్థాన్ ప్లేయర్.. ఏ బ్యాట్స్‌మెన్‌కు సాధ్యంకాని ఆ స్పెషల్ ఫీట్ ఏంటంటే?
Gujarat Titans Vs Rajasthan Royals Jos Buttler
Follow us

|

Updated on: May 30, 2022 | 6:21 AM

ఐపీఎల్ 2022(IPL 2022)లో, ఏ ఆటగాడైనా ఎక్కువ మంది నోళ్లలో నానుతూ ఉన్నాడంటే, అది ఒక్క జోస్ బట్లర్ మాత్రమే. ఇంగ్లండ్‌కు చెందిన ఈ బలమైన వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్‌ను పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ సీజన్ ప్రారంభం నుంచి పరుగుల వరద పారిస్తూనే ఉన్నాడు. ప్రతి ఇన్నింగ్స్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు. లేదా పాత రికార్డులు సమం చేస్తూనే ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ (GT vs RR Final) తో జరిగిన ఫైనల్‌లో అతను భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. కానీ సీజన్‌లోని చివరి మ్యాచ్‌లో కూడా అతను రికార్డు పుస్తకంలో తన పేరును లిఖించుకున్నాడు.

మే 29 ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్‌లో జోస్ బట్లర్ టీంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. కానీ, ఈసారి అతను భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. 35 బంతుల్లో అతడి బ్యాట్‌ నుంచి 39 పరుగులు మాత్రమే వచ్చాయి. అయితే, ఈ చిన్న ఇన్నింగ్స్‌లోనూ బట్లర్ తన పేరిట కొన్ని ప్రత్యేక రికార్డులను నమోదు చేసుకున్నాడు.

IPL 2022లో జోస్ బట్లర్ రికార్డులు..

జోస్ బట్లర్ 17 ఇన్నింగ్స్‌లలో 863 పరుగులతో సీజన్‌ను ముగించాడు. ఈ విధంగా, అతను ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ (848)ను బట్లర్ వదిలేశాడు. అయితే విరాట్ కోహ్లీ (973)ను అధిగమించలేకపోయాడు.

దీంతో పాటు ఐపీఎల్ 2022లో బట్లర్ 83 ఫోర్లు, 45 సిక్సర్లు కొట్టాడు. ఈ విషయంలోనూ ప్రస్తుత సీజన్‌లో బ్యాట్స్‌మెన్స్ అందరికంటే ముందున్నాడు. మొత్తం 128 బౌండరీలు బాదేశాడు. కేఎల్ రాహుల్ 45 ఫోర్లు, 30 సిక్సర్లతో 75 బౌండరీలతో రెండో స్థానంలో నిలిచాడు.

ఈ 39 పరుగుల ఇన్నింగ్స్‌తో, బట్లర్ ఐపీఎల్ సీజన్‌లో ప్లేఆఫ్ దశలో 200 పరుగులు దాటేశాడు. 3 ఇన్నింగ్స్‌ల్లో 234 పరుగులు చేశాడు. అతను తప్ప మరే బ్యాట్స్‌మెన్ ఈ ఫీట్ చేయలేకపోయాడు. అతనికి ముందు ప్లేఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు 2016లో 190 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ పేరిట నిలిచింది.

బట్లర్ ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేయడంతోపాటు 4 సెంచరీలు కూడా చేశాడు. దీంతో 2016 సీజన్‌లో 4 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు.

ఈ సీజన్‌లో బట్లర్ ఫాస్ట్ బౌలర్లపై 620 పరుగులు బాదేశాడు. ఇది ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు. అదే సమయంలో, స్పిన్నర్లపై 243 పరుగులు చేశాడు.