Fastest ball in IPL 2022: ఐపీఎల్ 2022లో అత్యంత స్పీడ్ బాల్ ఇదే.. ఉమ్రాన్ మాలిక్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన గుజరాత్ బౌలర్..
గుజరాత్ టైటాన్స్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ అత్యంత వేగంగా బంతిని విసిరి ఓ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో ఉమ్రాన్ మాలిక్‌ను వెనక్కు నెట్టి, అగ్రస్థానంలో నిలిచాడు.
ఐపీఎల్ 2022 (IPL 2022) ఫైనల్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ (GT vs RR)పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 130 పరుగులకే ఆలౌటైంది. 19వ ఓవర్ తొలి బంతికే గుజరాత్ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ ఉమ్రాన్ మాలిక్ రికార్డును బద్దలు కొట్టాడు. ఫెర్గూసన్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా బౌలింగ్ చేశాడు. గంటకు 157.3 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. ఐపీఎల్‌లో భారత ఆటగాడిగా అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన బౌలర్‌గా ఉమ్రాన్ నిలిచాడు.
రాజస్థాన్ బ్యాటింగ్ సమయంలో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 5వ ఓవర్ ఫెర్గూసన్‌కు ఇచ్చాడు. ఈ సమయంలో, ఫెర్గూసన్ ఓవర్లో అత్యంత వేగవంతమైన బంతిని వేశాడు. గంటకు 157.3 కిలోమీటర్ల వేగంతో ఈ బంతిని విసిరాడు. అదే ఓవర్ నాలుగో బంతిని కూడా ఫెర్గూసన్ చాలా వేగంగా వేశాడు. గంటకు 153 కిలోమీటర్ల వేగంతో ఈ బంతిని విసిరాడు. ఫెర్గూసన్ కంటే ముందు, షాన్ టైట్ కూడా గంటకు 157.3 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు.
ఐపీఎల్‌లో భారత బౌలర్ల గురించి మాట్లాడితే, ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా బౌలింగ్ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతిని వేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఉమ్రాన్ రికార్డును ఫెర్గూసన్ బద్దలు కొట్టాడు.
IPL చరిత్రలో అత్యంత వేగవంతమైన డెలివరీలు ఇవే..
లాకీ ఫెర్గూసన్ – 157.3 కిమీ/గం
షాన్ టైట్ – 157.3 కిమీ/గం
ఉమ్రాన్ మాలిక్ – 157 కిమీ/గం