Weight Loss: ఆకలిని 60 శాతం తగ్గించే 5 పదార్థాలు.. తింటే కొవ్వును ఇట్టే కరిగిస్తాయి.. స్టడీలో సరికొత్త విషయాలు..

బరువు తగ్గడానికి ప్రయత్నించే వ్యక్తులు కేలరీలను తక్కువగా ఉంచుకోవాలి. అంటే శరీరానికి అవసరమైన కేలరీల కంటే తక్కువ తినాలి. బరువు తగ్గించడంలో సహాయపడే కొన్ని ఆహారాలు కూడా ఉన్నాయి. ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Weight Loss: ఆకలిని 60 శాతం తగ్గించే 5 పదార్థాలు.. తింటే కొవ్వును ఇట్టే కరిగిస్తాయి.. స్టడీలో సరికొత్త విషయాలు..
food
Follow us
Venkata Chari

|

Updated on: May 28, 2022 | 11:35 AM

ప్రస్తుతం చాలా మంది ప్రజలు తమ పెరిగిన పొట్టను తగ్గించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం, వారు డైట్‌లను ఫాలో చేస్తుంటారు. అలాగే ట్రెడ్‌మిల్‌పై గంటల తరబడి పరిగెత్తుతూ తెగ కష్టపడుతున్నారు. నిజానికి, శరీరంలోని అదనపు కొవ్వు గుండెపోటు, స్ట్రోక్, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే అనేక శారీరక, మానసిక మార్పులు కూడా కనిపించడం ప్రారంభిస్తాయి. సరైన ఆహారం తీసుకుంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని మెయింటెయిన్ చేస్తే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక అధ్యయనంలో, ఏ రకమైన ఆహారం తినడం వల్ల ఆకలి 60 శాతం తగ్గుతుంది. దీంతో పొట్ట కొవ్వును కూడా భారీగా తగ్గించేందుకు సహాయం చేస్తుందని పేర్కొంది.

ఆకలి తగ్గాలంటే ఇలాంటి ఆహారాలు తినండి..

శరీరంలోని కొవ్వు లేదా అదనపు కొవ్వును తగ్గించుకోవడానికి నీరు పుష్కలంగా తాగడమే ఉత్తమ మార్గం అని నిపుణులు పేర్కొంటున్నారు. స్ప్రింగర్ ఓపెన్‌లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, థర్మోజెనిక్ ఆహారాలు తినడం వల్ల కొవ్వును కరిగించుకోవచ్చని పేర్కొంది.

వాస్తవానికి, థర్మోజెనిక్ ఆహారాలు థర్మోజెనిసిస్ ప్రక్రియను పెంచడం ద్వారా జీవక్రియను సక్రమంగా ఉంచడంతోపాటు, కేలరీల బర్నింగ్‌ను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. థర్మోజెనిసిస్ అంటే శరీరం తిన్న ఆహారాన్ని ఉపయోగించుకోవడానికి కేలరీలను బర్న్ చేసి, ఆ కేలరీలను శక్తిగా మార్చే ప్రక్రియ అన్నమాట. శరీరం తన రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి శారీరక శ్రమ ద్వారా కేలరీలను బర్న్ చేస్తుంది. అయితే థర్మోజెనిసిస్ కూడా చాలా కేలరీలను బర్న్ చేస్తుంది. అందుకే థర్మోజెనిసిస్ ఫుడ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

థర్మోజెనిక్ ప్రక్రియను పెంచే, కేలరీలను బర్న్ చేసే థర్మోజెనిక్ ఆహారాలు, వీటిని థర్మోజెనిక్ ఫుడ్స్ అని పిలుస్తుంటారు. దీని వల్ల అదనపు పొట్ట కొవ్వు తగ్గుతుంది. ఈ ఆహారాలను ఎవరైనా తీసుకోవచ్చు. అలాంటి ఆహారాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఎరుపు లేదా పచ్చి మిరపకాయ

నల్ల మిరియాలు

అల్లం

కొబ్బరి నూనె

ప్రోటీన్

కొవ్వును కరిగించడంలో ప్రోటీన్ ఎలా సహాయపడుతుంది?

నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడానికి ప్రోటీన్ ఫుడ్స్ తినాలని సిఫార్సు చేసింది. ప్రోటీన్‌కు ప్రధాన విధి కండరాల కణజాలాన్ని సరిచేయడం అని నమ్ముతున్నారు. కానీ, ప్రొటీన్లు కూడా బరువు తగ్గించడంలో బాగా సహాయపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. దీనికి కారణం ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తిన్న తర్వాత ఆకలి తగ్గి కడుపు నిండుగా ఉండటమే.

ఆహారంలో లీన్ ప్రోటీన్ మూలాలను చేర్చుకుంటే, చాలా తక్కువ తినడంవల్ల పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. ప్రొటీన్‌లు ఎక్కువగా తీసుకునేవారిలో ఆకలి 60 శాతం తగ్గుతుందని పరిశోధనలో తేలింది.

అదే సమయంలో, జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా ప్రోటీన్ 80-100 కేలరీలు ఎక్కువగా బర్న్ చేస్తుంది. 2011లో ఒబెసిటీ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం, 27 మంది అధిక బరువు, ఊబకాయం ఉన్న పురుషుల నమూనాను పరిశీలించినట్లు పేర్కొంది.

ఈ నమూనాను మూడు గ్రూపులుగా విభజించారు. అందులో రెండు గ్రూపులు రోజుకు మూడు లేదా ఆరు సార్లు భోజనం చేసి, అధిక ప్రొటీన్‌ల ఆహారాలను తీసుకునేవారని పేర్కొంది. మూడవ సమూహం సాధారణ పద్ధతిలో రోజుకు 3 సార్లు మాత్రమే తిన్నారని పేర్కొంది.

25 శాతం ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఆకలిని 60 శాతం తగ్గించవచ్చని పరిశోధనలు కనుగొన్నాయి. దీంతో పాటు రాత్రి పూట చిరుతిళ్లు తినే అలవాటు కూడా 50 శాతం తగ్గినట్లు తెలినట్లు కొనుగొన్నారు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న వివరాలు కేవలం సమాచారం కోసమేనని గ్రహించాలి. ఇందులోని ఏదైనా పద్ధతులు, చిట్కాలు పాటించాలంటే మాత్రం కచ్చితంగా నిపుణుల సూచనలు తప్పక తీసుకోవాలి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే