Alert Farmers: రైతులకి గమనిక.. పాడిజంతువులకి సోకుతున్న ప్రమాదకరమైన వ్యాధి..!
Alert Farmers: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పశుపోషణపై దృష్టి సారిస్తోంది. కానీ పశువులు రోగాలబారిన పడకుండా ఉంటేనే పశుపోషణ బాగుంటుంది.
Alert Farmers: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పశుపోషణపై దృష్టి సారిస్తోంది. కానీ పశువులు రోగాలబారిన పడకుండా ఉంటేనే పశుపోషణ బాగుంటుంది. లేదంటే సంపాదన మొత్తం వైద్యులకే దక్కుతుంది. ఈ రోజుల్లో జంతువులలో హెమరేజిక్ సెప్టిసిమియా అనే ప్రమాదకరమైన వ్యాధి సోకుంతుంది. జంతువులను ఈ వ్యాధి నుంచి రక్షించడం చాలా ముఖ్యం. దీని కారణంగా జంతువులు అకాలంగా మరణిస్తున్నాయి. వర్షాకాలంలో ఈ వ్యాధి చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశంలో పాలు, పాల ఉత్పత్తులతో ఏటా దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పశుపోషణ మనకు ఎంత ముఖ్యమో అర్థం అవుతుంది. ఈ వ్యాధి నుంచి జంతువులని ఎలా కాపాడాలో తెలుసుకుందాం.
గల్గోటు వ్యాధి ప్రధానంగా ఆవులు, గేదెలలో సంభవిస్తుంది. ఈ వ్యాధి మే-జూన్‌లో సోకుతుంది. దీనిని గల్ఘోంటు, గల్గొంటు, ఘూర్ఖా అంటూ వివిధ పేర్లతో పిలుస్తారు. ఇది జంతువులకు సంభవించే ఒక అంటు వ్యాధి. ఇది బాక్టీరియా ద్వారా వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం. వర్షం నీరు చేరే ప్రాంతాల్లో ఈ వ్యాధిని కలిగించే బాక్టీరియా ఉంటుంది. అపరిశుభ్రమైన ప్రదేశాలలో ఉన్న జంతువులు, సుదీర్ఘ ప్రయాణం లేదా అధిక పనితో అలసిపోయిన జంతువులపై ఈ బాక్టీరియా త్వరగా దాడి చేస్తుంది. వ్యాధి వ్యాప్తి చాలా వేగంగా ఉంటుంది.
గల్గోటు వ్యాధి లక్షణాలు
అధిక జ్వరం, అధిక జ్వరం 105 నుండి 106°F, కళ్ళు ఎర్రబడి వాచిపోవడం, ముక్కు, కళ్ళు, నోటి నుంచి ద్రవం కారడం, మెడ, తల, లేదా ముందు కాళ్ల మధ్య వాపు ఉండటం, ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు శబ్ధం రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటం, చివరకి ఊపిరాడక జంతువు మరణించడం జరుగుతుంది.
గల్గోటు వ్యాధి చికిత్స..
ఈ వ్యాధికి తక్షణ చికిత్స చేయకపోతే జంతువు మరణిస్తుంది. దానిని సమీపంలోని పశువైద్యశాలకు తరలించి వెంటనే చికిత్స అందించాలి. ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందు ఈ వ్యాధికి సంబంధించిన టీకాలు తప్పనిసరిగా వేయించాలి. సుదీర్ఘ ప్రయాణానికి ముందు కూడా జంతువుకు టీకాలు వేయాలి. వ్యాధి లక్షణాలను చూసినప్పుడు అనారోగ్య జంతువును ఇతర ఆరోగ్యకరమైన జంతువుల నుంచి వేరు చేయడం మంచిది. అనారోగ్యంతో ఉన్న జంతువును నది, చెరువు, నీటి కుంటలో నీరు తాగడానికి తీసుకెళ్లవద్దు. జబ్బుపడిన జంతువు కంటే ముందుగా ఆరోగ్యకరమైన జంతువులకు మేత, ధాన్యం, నీరు మొదలైనవి ఇవ్వండి. చనిపోయిన జంతువు కళేబరాన్ని శాస్త్రీయ పద్ధతిలో లోతైన గొయ్యి తవ్వి ఉప్పు లేదా సున్నం వేసి పాతిపెట్టాలి. లేదంటే ఈ అంటువ్యాధి అన్నిటికి సోకే ప్రమాదం ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి