Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

Today Horoscope (డిసెంబర్ 24, 2024): మేష రాశి వారికి ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పని భారం నుంచి విముక్తి లభిస్తుంది. వృషభ రాశి వారికి అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. మిథున రాశి వారికి కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 24th December 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 24, 2024 | 5:01 AM

దిన ఫలాలు (డిసెంబర్ 24, 2024): మేష రాశి వారికి ఉద్యోగంలో పని భారం నుంచి విముక్తి లభిస్తుంది. వృషభ రాశి వారికి అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి. మిథున రాశి వారికి కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడడం, పదోన్నతి లభించడం, గుర్తింపు పొందడం వంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగంలో పని భారం నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. వృత్తి జీవితంలో తీరిక లభించక పోవచ్చు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఉన్నత వర్గాలతో మంచి పరిచయాలు ఏర్పడతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో ఆకస్మిక అధికార యోగానికి అవకాశం ఉంది. అధికారులకు మీ పనితీరు సంతృప్తి కలిగిస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి తగ్గే అవకాశం లేదు. పెళ్లి ప్రయత్నాలకు బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆదాయ వృద్ధికి సంబంధించి ఏ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. వృత్తి, ఉద్యోగాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. నిరుద్యోగులు శుభ వార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో కొద్దిగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభముంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరుగుతాయి. కొందరు బంధు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు రాజీమార్గంలో పరిష్కారమయ్యే సూచనలున్నాయి. ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపో వడం మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. వృత్తి, వ్యాపారాలు లాభదా యకంగా సాగిపోతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో అధికా రులు బాగా ప్రాధాన్యం ఇస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చాలావరకు అనుకూల ఫలితాలనిస్తాయి. ఆదాయ వృద్ధికి సమయం అనుకూలంగా ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అనేక విధాలుగా ధన లాభాలు కలుగుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా విజయం వరిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రయాణాలు బాగా లాభి స్తాయి. వృత్తి జీవితంలో పనిభారం పెరిగినా ప్రతిఫలం ఉంటుంది. సన్నిహితుల నుంచి ముఖ్య మైన వ్యవహారాల్లో మిత్రుల సహాయం లభిస్తుంది. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయ త్నాల్లో తప్పకుండా విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన లాభాలు ఉంటాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కొన్ని ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవ కాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయ మార్గాలు అధిక లాభాలనిస్తాయి. వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తి కరంగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో పని భారం పెరిగినా ప్రతిఫలం ఉంటుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయానికి లోటుండకపోవచ్చు. రావలసిన డబ్బంతా సకాలంలో చేతికి అందుతుంది. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. అవసర సమయాల్లో బంధువులు ఆదుకుంటారు. కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగుల సమర్థత మీద అధికారులకు నమ్మకం పెరుగుతుంది. పెండింగ్ పనుల్ని మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో పని భారం బాగా తగ్గుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. గృహ, వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. అనుకోకుండా బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. బంధుమిత్రులకు మీ సలహాలు బాగా ఉపయోగపడతాయి. ముఖ్య మైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమి స్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.

న్యూ ఇయర్ వెకేషన్‌కు ప్లాన్ చేశారా.. ఈ టిప్స్ పాటించడం మస్ట్..!
న్యూ ఇయర్ వెకేషన్‌కు ప్లాన్ చేశారా.. ఈ టిప్స్ పాటించడం మస్ట్..!
వివాదంలో చిక్కుకున్న ఎంఎస్ ధోని.. జార్ఖండ్ ప్రభుత్వం సీరియస్
వివాదంలో చిక్కుకున్న ఎంఎస్ ధోని.. జార్ఖండ్ ప్రభుత్వం సీరియస్
డాకూ మహరాజ్ ప్రెస్ మీట్..! శంబాల ఫస్ట్ లుక్ రిలీజ్..
డాకూ మహరాజ్ ప్రెస్ మీట్..! శంబాల ఫస్ట్ లుక్ రిలీజ్..
కృష్ణుడి గోపికలుగా అక్కాచెల్లెళ్లు.. ఎవరో గుర్తు పట్టారా?
కృష్ణుడి గోపికలుగా అక్కాచెల్లెళ్లు.. ఎవరో గుర్తు పట్టారా?
రూ.6 లక్షల విలువైన పాత కారును లక్షకు అమ్మితే రూ.90 వేల జీఎస్టీ
రూ.6 లక్షల విలువైన పాత కారును లక్షకు అమ్మితే రూ.90 వేల జీఎస్టీ
గుడ్లను వీటితో కలిపి తింటే డేంజర్ బెల్స్ మోగినట్లే.. జాగ్రత్త!
గుడ్లను వీటితో కలిపి తింటే డేంజర్ బెల్స్ మోగినట్లే.. జాగ్రత్త!
టీమిండియా స్టార్ పేసర్ బౌలింగ్ యాక్షన్‌పై ఆరోపణలు
టీమిండియా స్టార్ పేసర్ బౌలింగ్ యాక్షన్‌పై ఆరోపణలు
రేపు, ఎల్లుండి శబరిమల అయ్యప్ప దర్శనాల సంఖ్య తగ్గింపు.. ఎందుకంటే
రేపు, ఎల్లుండి శబరిమల అయ్యప్ప దర్శనాల సంఖ్య తగ్గింపు.. ఎందుకంటే
కావ్య ఆర్డర్స్‌కి రుద్రాణి, ధాన్యలక్ష్మి హడల్.. రాజ్ సపోర్ట్!
కావ్య ఆర్డర్స్‌కి రుద్రాణి, ధాన్యలక్ష్మి హడల్.. రాజ్ సపోర్ట్!
10 రోజుల వ్యవధిలో ముగ్గురు స్టూడెంట్స్ అదృశ్యం
10 రోజుల వ్యవధిలో ముగ్గురు స్టూడెంట్స్ అదృశ్యం