సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. బీకర ఫామ్‌లో కావ్య పాప ఏరికొరి తెచ్చుకున్న ప్లేయర్..
Ishan Kishan: గతేడాది నుంచి టీమ్ ఇండియాకు ఇషాన్ కిషన్ దూరమయ్యాడు. మళ్లీ టీంలోకి ఎలాగైనా రీఎంట్రీ ఇవ్వాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. . దేశవాళీ క్రికెట్‌లో బ్యాట్‌తో పరుగులు చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నాడు. తాజాగా సెంచరీతో ఆదరగొట్టాడు.ఇషాన్ 78 బంతుల్లో 134 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు
టీమిండియాలో రీ ఎంట్రీ కోసం వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనను అర్ధాంతరంగా వదిలేసినప్పటి నుంచి భారత జట్టులో చోటు దక్కించుకోలేదు. మరోవైపు రీ ఎంట్రీ కోసం దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ జట్టుకు సూచించింది. ఐతే ఇషాన్ కిషన్ గత కొన్ని నెలలుగా దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ప్రస్తుతం దేశంలో విజయ్ హజారే పోటీ కొనసాగుతోంది. విజయ్ హజారే టోర్నమెంట్ 50 ఓవర్లు ఉంటుంది. ఈ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన చేసే ఆటగాళ్లను ఛాంపియన్స్ ట్రోఫీకి పరిగణించే అవకాశం ఉంది. జార్ఖండ్‌కు ఆడుతున్నా ఇషాన్ దూకుడు ఇన్నింగ్స్‌తో సెంచరీ చేశాడు. ఇషాన్ కిషన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ బ్యాటింగ్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇషాన్ 78 బంతుల్లో 134 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 16 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. అతని స్ట్రైక్ రేట్ 171కి పైగా ఉంది.
ఇషాన్ కిషన్ చివరిసారిగా 2023 అక్టోబర్‌లో వన్డే ఆడాడు. ఈ మ్యాచ్ ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగింది. అప్పటి నుంచి ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోలేదు. అంతేకాదు కేంద్ర కాంట్రాక్టు జాబితా నుంచి కూడా ఆయనను తొలగించారు. కాగా, దేశవాళీ క్రికెట్‌లో ఇషాన్ కిషన్ తన సత్తా చాటాడు. కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీకి అతని పేరు చర్చకు వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇషాన్‌ను ఎంపిక చేస్తారో తెలియాల్సి ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి దాదాపు నెలన్నర సమయం ఉంది. హైబ్రిడ్ మోడల్‌లో పోటీ నిర్వహించనున్నారు. అలాగే భారత్ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి. ఫిబ్రవరిలో జరగనున్న ఈ టోర్నీకి టీమిండియా జట్టును ఇంకా ప్రకటించలేదు. అయితే కొంతమంది ఆటగాళ్ల ప్రదర్శనపై సెలక్షన్ కమిటీ కన్ను వేసింది. మిగిలిన విజయ్ హజారే ట్రోఫీలో ఇషాన్ కిషన్ పెద్ద నాక్ లేదా రెండు ఆడితే, అతని పేరును పరిశీలించవచ్చు. అదే సమయంలో అతను ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడనున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి