Virus Pandemic: నిను వీడని నీడను నేను.. యావత్ మానవాళిని హడలెత్తిస్తున్న వైరస్‌లు.. ఒకటి వెంట మరొకటి.
ఒకవైపు కరోనా వైరస్ విధ్వంసం ఇంకా అది పూర్తిగా ముగియలేదు. అదే సమయంలో, మరో మూడు కొత్త వ్యాధులు వచ్చాయి.. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మంకీ పాక్స్, హెపటైటిస్, టొమాటో ఫ్లూ.. ఇవి చాలా దేశాలలో వ్యాప్తి చెందుతున్నాయి
Virus Pandemic: ప్రపంచ మానవాళిపై వైరస్ లు పగబట్టినట్లు ఉన్నాయి. గత రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ రోజుకో రూపు దిద్దుకుని ప్రపంచదేశాలను ఓ రేంజ్ లో వణికించింది. అయితే ఇప్పుడిప్పుడే ఈ కోవిడ్ బారినుంచి బయటపడుతున్నాం అనుకుని సంతోషపడి లోపు.. మరో మూడు కొత్త వైరస్ లు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తూ.. భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు కరోనా వైరస్ విధ్వంసం ఇంకా అది పూర్తిగా ముగియలేదు. అదే సమయంలో, మరో మూడు కొత్త వ్యాధులు వచ్చాయి.. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మంకీ పాక్స్, హెపటైటిస్, టొమాటో ఫ్లూ.. ఇవి చాలా దేశాలలో వ్యాప్తి చెందుతున్నాయి. ఈరోజు ఈ వ్యాధుల గురించి తెలుసుకుందాం..
టొమాటో ఫ్లూ: ఇది టొమాటో జ్వరం అని కూడా పిలువబడే ఒక రకమైన వైరల్ ఫీవర్. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడిన పిల్లల శరీరంపై టొమాటో రూపంలో ఎర్రటి దద్దుర్లు వస్తాయి.. అందుకే దీనిని టొమాటో ఫ్లూ అంటారు. దద్దుర్లు దురద, మంట, అలాగే జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న పిల్లలు కీళ్ల నొప్పితో బాధపడతారు. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ కారణంగా పిల్లల జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. దీని కారణంగా వీరు డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటారు. ఈ వ్యాధి భారతదేశంలో కూడా వ్యాపించింది. కేరళలోని కొల్లంలో 80 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు ఈ వ్యాధి సోకింది. ఇక ఒడిశా లో కూడా టొమాటో జ్వరం విజృభిస్తుంది.
మంకీపాక్స్: ఇది అరుదైన జూనోసిస్ ఇన్‌ఫెక్షన్. ఈ వైరస్ 1958లో మొదటిసారిగా కోతులలో కనుగొనబడింది. మొదటి కేసు 1970లో నమోదైంది. ఈ వ్యాధి ప్రధానంగా మధ్య,పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాల్లో ఉండేది.. అయితే ఇప్పుడు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించడం ప్రారంభించింది. బాగా. ఈ వ్యాధి Poxviridae కుటుంబానికి చెందినది. మశూచికి కారణమయ్యే వైరస్లు కూడా ఈ కుటుంబానికి చెందినవి. ఇప్పుడు యూరప్, అమెరికా, ఆస్టేలియా, కెనడా వంటి అనేక దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.
హెపటైటిస్: హెపటైటిస్ అనే ఇన్ఫెక్షన్ పిల్లల్లో వ్యాపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా హెపటైటిస్ కేసులు తీవ్రమైన సంఖ్యలో ఉన్నాయి. ఈ ఇన్ఫెక్షన్ సోకిన బాధితుల్లో కాలేయంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కాలేయం ఎర్రబడి, వాపుతో పాటు.. రక్తంలో కాలేయ ఎంజైమ్‌ల పరిమాణంలో పెరుగుదలకు కారణమవుతుంది. దీని కారణంగా, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడతారు. అనంతరం కామెర్ల బారిన పడతారు. ఈ వ్యాధి లక్షణాలు కళ్ళు, చర్మం తెల్లటి భాగం పసుపు రంగులోకి మారడం, లేత రంగులో మలం, ముదురు రంగు మూత్రం, ఆకలి లేకపోవడం, అలసట, కీళ్ల నొప్పులు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..