Weight Loss Tips: పొట్ట, బరువు తగ్గాలంటే వీటిని తీసుకోండి చాలు.. కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..
బరువును తగ్గించుకునేందుకు ఆహారంలో కొన్ని ఆయుర్వేద మూలికలు, సుగంధ ద్రవ్యాలను చేర్చకోవడం మంచిది.
Weight Loss Ayurvedic Tips: ప్రస్తుత కాలంలో బరువు తగ్గడం అంత సులభం కాదు. బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. మొండి కొవ్వును కరిగించుకోవడానికి ఆయుర్వేదంలో చాలా రెమెడీస్ ఉన్నాయి. ఈ సహజ పద్ధతులు బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ఆయుర్వేదం ప్రకారం.. బరువును తగ్గించుకునేందుకు ఆహారంలో కొన్ని ఆయుర్వేద మూలికలు, సుగంధ ద్రవ్యాలను చేర్చకోవడం మంచిది. ఈ పద్ధతులు జీవక్రియను పెంచుతాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ని బయటకు పంపుతాయి. వీటిని తిన్న తర్వాత చాలా సేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. బరువు తగ్గడానికి మీరు ఎలాంటి ఆయుర్వేద చిట్కాలను అనుసరించవచ్చో ఇప్పుడు చూడండి..
మెంతికూర: మెంతులు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. ఇవి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. మెంతికూర, లేదా మెంతులు తీసుకోవడం ద్వారా మీరు చాలా కాలం పాటు కడుపు నిండిన అనుభూతిని పొందుతారు. ఇవి ఆహార కోరికలను తగ్గించడంలో సహాయపడతాయి. మెంతికూర శరీరంలో జీవక్రియ రేటును కూడా పెంచుతుంది. కొన్ని మెంతి గింజలను వేయించి గ్రైండ్ చేసి పౌడర్ చేయండి. ఈ పొడిని ఉదయం ఖాళీ కడుపుతో నీటితో కలిపి తీసుకోవచ్చు. లేదా మెంతులను రాత్రిపూట నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత ఉదయాన్నే ఖాళీ కడుపుతో.. ఈ నీటిని తాగడంతోపాటు విత్తనాలను తినండి.
త్రిఫల చూర్ణం: త్రిఫల చూర్ణం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. త్రిఫల చూర్ణం రాత్రి భోజనం తర్వాత కనీసం రెండు గంటల తర్వాత, అల్పాహారానికి అరగంట ముందు వెచ్చని నీటిలో తీసుకోవాలి.
పసుపు: పసుపును సాధారణంగా కూరలలో ఉపయోగిస్తారు. పసుపులో బరువు తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడతాయి. పసుపును పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు.
దాల్చిన చెక్క: దాల్చిన చెక్క శరీరంలోని జీవక్రియ రేటును పెంచుతుంది. ఇది బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక కప్పు దాల్చిన చెక్క టీని ఉదయాన్నే తీసుకోవడం చాలామంచిది.
నల్ల మిరియాలు: నల్ల మిరియాలు పైపెరిన్ మూలకాన్ని కలిగి ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. జీవక్రియను వేగవంతం చేయడం కోసం బ్లాక్ పెప్పర్ టీ తాగడం మంచిది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..