AP News: మూడు నెలలుగా బాలికపై అఘాయిత్యం.. గ్రామ వాలంటీర్‌‌పై కేసు నమోదు

వాలంటీర్‌గా పని చేస్తున్న రావిపాటి కోటయ్య బాలికను బెదిరించి.. గత మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.

AP News: మూడు నెలలుగా బాలికపై అఘాయిత్యం.. గ్రామ వాలంటీర్‌‌పై కేసు నమోదు
Representational Image
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 31, 2022 | 4:39 PM

Village volunteer : ఏపీలో మరో వాలంటీర్ దారుణానికి పాల్పడ్డాడు. మూడు నెలలుగా.. గ్రామ వాలంటీర్ 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడుతుండగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం వేరే గ్రామానికి వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నారు. దీంతో బాలిక అమ్మమ్మతో కలిసి బాలిక గ్రామంలోనే ఉంటోంది.

ఈ క్రమంలో వాలంటీర్‌గా పని చేస్తున్న రావిపాటి కోటయ్య బాలికను బెదిరించి.. గత మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని చెబితే చంపుతానంటూ బెదిరించడంతో ఆమె.. ఇంట్లో చెప్పలేదు. వాలంటీర్ నుంచి వేధింపులు తీవ్రం కావడంతో.. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితురాలిని చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. నిందితుడు పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..