Tirupati: కిరాతక సాఫ్ట్‌వేర్.. భార్యను దారుణంగా చంపాడు.. ఆ తర్వాత సూట్‌ కేసులో పెట్టి..

పద్మను భర్తే హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని నగర శివారులోని వెంకటాపురం చెరువులో గుర్తించారు.

Tirupati: కిరాతక సాఫ్ట్‌వేర్.. భార్యను దారుణంగా చంపాడు.. ఆ తర్వాత సూట్‌ కేసులో పెట్టి..
Crime News
Follow us

|

Updated on: May 31, 2022 | 4:11 PM

Tirupati man killed wife: అతనొక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఇష్టంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వాత కుటుంబ కలహాలతో భార్యను వేధించడం మొదలు పెట్టాడు. చివరకు భార్యను చంపి.. సూట్‌కేసులో పెట్టి చేరువులో పడేశాడు. ఐదు నెలల అనంతరం అసలు విషయం వెలుగుచూసింది. తిరుపతి సత్యనారాయణపురంలో వివాహిత పద్మావతి అదృశ్యం.. కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. పద్మను భర్తే హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని నగర శివారులోని వెంకటాపురం చెరువులో గుర్తించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యనారాయణపురానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వేణుగోపాల్‌తో కొర్లకుంటకు చెందిన పద్మకు 2009లో వివాహమైంది. కొన్నేళ్లపాటు వీరి కాపురం సజావుగా సాగగా.. ఆ తర్వాత కుటుంబ కలహాలతో భార్యాభర్తలిద్దరూ తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో పద్మ దిశ పోలీస్‌స్టేషన్‌లో వేణుగోపాల్‌పై ఫిర్యాదు చేసింది.

ఆ తర్వాత పోలీసులు వేణుగోపాల్, అతడి కుటుంబసభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం కొన్ని రోజుల పాటు బాగానే ఉన్నప్పటికీ.. మళ్లీ విభేదాలు తలెత్తాయి. దీంతో వేణుగోపాల్‌ను విడిచిపెట్టి పద్మ పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత వేణుగోపాల్ అత్తమామలకు నచ్చజెప్పి భార్యను మళ్లీ తన ఇంటికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో జనవరి 5న వేణుగోపాల్ పద్మను చంపేసి సూట్‌కేసులో పెట్టి తిరుపతి శివారులోని వెంకటాపురం చెరువులో పడేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. జనవరి నుంచి పద్మ తనతోనే ఉన్నట్లు వేణుగోపాల్ అత్తమామలను నమ్మించాడు.

అయితే.. ఐదునెలలుగా తమ కుమార్తెతో మాట్లాడనీయకుండా చేయడంతో పద్మ తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో వారు తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి వేణుగోపాల్‌ను పోలీసులు రప్పించి పోలీసులు తమదైన శైలీలో విచారించగా.. తానే హత్య చేసి చెరువులో పడేసినట్లు తెలిపాడు. చెరువు వద్దకు వెళ్లిన పోలీసులు కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీయించి.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..