Telangana: ఇష్టం లేని పెళ్లితో పుట్టింటికి చేరిన యువతి.. తప్పతాగి తండ్రి చేసిన దారుణం..
ఇటీవలి కాలంలో గత కొద్దిరోజులుగా నవ వధువు మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇష్టంలేని పెళ్లి చేశారని ఒకరు, ప్రేమ పెళ్లి జరగలేదని మరోకరు ఇలా వరుసగా కొత్త పెళ్లి కూతుర్లు మరణించిన ఘటనలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
Telangana Crime News: ఇటీవలి కాలంలో గత కొద్దిరోజులుగా నవ వధువు మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇష్టంలేని పెళ్లి చేశారని ఒకరు, ప్రేమ పెళ్లి జరగలేదని మరోకరు ఇలా వరుసగా కొత్త పెళ్లి కూతుర్లు మరణించిన ఘటనలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఎంతో సంతోషంగా, అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిన గంటలు, రోజుల వ్యవధిలోనే పెళ్లి కూతురి మరణం ఆ పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. కాళ్ళ పారాణి ఆరకముందే, ద్వారాలకు కట్టిన తోరణాలు వాడిపోక ముందే నవ వధువు అనంత లోకాలకు చేరిపోవటం అందరినీ కలచివేస్తోంది. తాజాగా మరో నవ వధువు తల్లితో సహా తండ్రి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన మహబూబ్‌నగర్‌లో తీవ్ర కలకలం రేపుతోంది.
నవ వధువు కన్నతండ్రి చేతిలో దారుణ హత్యకు గురైన ఘటన మహబూబ్ నగర్ లో చోటుచేసుకుంది.. మహబూబ్ నగర్ శివారు ప్రాంతమైన జైన్ అలిపూర్ గ్రామంలో గత రాత్రి.. కృష్ణయ్య అనే వ్యక్తి.. తన భార్య కళమ్మ.. కన్న కూతురు సరస్వతిలపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చాడు.. అనంతరం తను కూడా గుళికల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.. సరస్వతి కి ఈ నెల 8వ తేదీన వివాహం జరిగింది.. కాగా తనకు ఇష్టంలేని పెళ్లిచేశారని వారం క్రితం పుట్టింటికి తిరిగి వచ్చింది సరస్వతి.. అత్తారింటికి వెళ్లేందుకు ససేమీరా ఇష్టపడలేదు. తల్లి కళమ్మ కూడా కూతురికి అండగా నిలిచేది. ఈ నేపథ్యంలో వారం రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ కోవలోనే గత రాత్రి ఫుటుగా తాగి ఇంటికి వచ్చిన కృష్ణయ్య భార్య.. కూతురుతో గొడవపడ్డాడు. కర్రతో విచక్షణా రహితంగా మోదాడు.. దాంతో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం కృష్ణయ్య కూడా గుళికల మందు సేవించాడు.. ఈ విషయాన్ని కృష్ణయ్య ఫోన్ ద్వారా బంధువులకు తెలియజేయడంతో.. బంధువులు వచ్చి ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు.. ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉండటంతో.. హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు.. కృష్ణయ్య కొడుకు బాలరాజుతో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. కేసును దర్యాప్తు చేస్తున్నారు.