Good News: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 8 ప్రత్యేక రైళ్లు..
Summer Special Trains: తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణీకులకు లబ్ధి చేకూరేలా.. మరో 08 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ద.మ.రైల్వే అధికారులు మంగళవారంనాడు ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు.
Railway News/IRCTC: వేసవి సీజన్ సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల మధ్య రైల్వే శాఖ(Indian Railways) పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోనూ దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణీకులకు లబ్ధి చేకూరేలా.. మరో 08 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ద.మ.రైల్వే అధికారులు మంగళవారంనాడు ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు. సమ్మర్ సీజన్‌లో ప్రయాణీకుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు జూన్ మాసంలో సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్ (Secunderabad – Kakinada Town)కి 4 సర్వీసుల ప్రత్యేక రైళ్లు, కాకినాడ టౌన్ నుంచి వికారాబాద్‌కు (Kakinada Town – Vikarabad) నాలుగు సర్వీసుల ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.
ప్రత్యేక రైలు (నెం.07193) సికింద్రాబాద్ నుంచి జూన్ మాసం 04, 11, 18, 25 తేదీల్లో రాత్రి 11.55 గం.లకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 10.10 గం.లకు కాకినాడ టౌన్‌కు చేరుకోనుంది.
అలాగే ప్రత్యేక రైలు (నెం.07194) కాకినాడ టౌన్ నుంచి జూన్ 05, 12, 19, 26 తేదీల్లో రాత్రి 08.45 గం.లకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 09.30 గం.లకు వికారాబాద్ చేరుకుంటుంది.
ట్రైన్ నెం.07193 సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ ప్రత్యేక రైళ్లు (04 సర్వీసులు)
ఈ ప్రత్యేక రైలు కాజీపేట్, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగనుంది.
ట్రైన్ నెం.07194 కాకినాడ టౌన్ – వికారాబాద్ ప్రత్యేక రైళ్లు (04 సర్వీసులు)
ఈ ప్రత్యేక రైళ్లు సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట్, మౌలాలి, సికింద్రాబాద్, లింగంపల్లి రైల్వే స్టేషన్లలో ఆగనుంది.
ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉండనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించి టికెట్ రిజర్వేషన్లు మొదలయ్యాయి.
పలు రైళ్లకు అదనపు కోచ్‌లు..
ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు అదనపు కోచ్‌లను జతచేర్చనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. వాటి వివరాలను ద.మ.రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
Additional Coaches for 22 Trains to Clear Extra Rush during June pic.twitter.com/1HfnSAYaqS
— South Central Railway (@SCRailwayIndia) May 31, 2022
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..