AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mallu Bhatti Vikramarka: ప్రజా ఆకాంక్షలు నేరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యం.. చారిత్రాత్మకంగా నవ సంకల్ప శిబిర్..

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Mallu Bhatti Vikramarka: ప్రజా ఆకాంక్షలు నేరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యం.. చారిత్రాత్మకంగా నవ సంకల్ప శిబిర్..
Mallu Bhatti Vikramarka
Shaik Madar Saheb
|

Updated on: May 31, 2022 | 5:09 PM

Share

Congress Nava Sankalp Shibir: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి నవ సంకల్ప్ మేథో మధన శిబిర్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కీసరలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న నవ సంకల్ప్ మేథో మధన శిబిర్ సమావేశాలు చారిత్రాత్మకంగా నిలిచిపోతాయని భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. మంగళవారం హైదరాబాద్ గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నవ సంకల్ప మేధోమధన శిబిర్ కన్వీనర్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర రెడ్డి తో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం దశాబ్దాల తరబడి పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రస్తుత ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపైన నవ సంకల్ప శిబిరంలో లోతుగా చర్చించి రోడ్ మ్యాప్ సిద్ధం చేసి 2023 సార్వత్రిక ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని వివరించారు.

నవ సంకల్ప మేధోమధన శిబిరంలో రాజకీయ ఆర్థిక సామాజిక అంశాలపై చర్చించడానికి ఆరు కమిటీలను వేసినట్లు తెలిపారు. ఒక్కో కమిటీ లో ఒక సీనియర్ నాయకుడు కన్వీనర్ గా, 25 నుంచి 30 మంది సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. మొదటి రోజున ఉదయం నుంచి రాత్రి వరకు వారికి అప్పగించిన అంశంపైన కమిటీలో లోతుగా చర్చించి వారి చర్చల్లో వచ్చిన సారాంశాన్ని నిర్ణయాలుగా నివేదిక రూపంలో.. నవసంకల్ప మెయిన్ కమిటీకి రెండవ రోజున అప్పగిస్తారని తెలిపారు. 6 కమిటీల నుంచి వచ్చిన నిర్ణయాలను మెయిన్ కమిటీ క్రోడీకరించి పీఏసీలో ప్రవేశపెట్టి ఆ కమిటీలో చర్చించిన అనంతరం కాంగ్రెస్ పాలసీ గా మేధోమధనం శిబిరం నిర్ణయాలను రెండవ రోజు సాయంత్రం ప్రకటిస్తామని వివరించారు. ఈ కమిటీ లో ఉండే సభ్యులు భేషజాలకు వెళ్లకుండా, అరమరికలు లేకుండా, తమ అభిప్రాయాలు నిర్భయంగా స్పష్టంగా ఆలోచన విధానాలను కమిటీలో పెట్టి చర్చించాలని సూచించారు. ఒకే సభ్యుడు రెండు మూడు కమిటీలో ఉన్నట్లయితే వారి అభిప్రాయాలను, సలహాలు, సూచనలను లిఖితపూర్వకంగా సంబంధిత కమిటీ కన్వీనర్ కు అప్పగించాలని కోరారు.

కమిటీ కన్వీనర్లు వీరే..

ఇవి కూడా చదవండి

ఆర్గనైజేషన్ కమిటీ కి కన్వీనర్ గా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పోలిటికల్ కమిటీ కి కన్వీనర్ గా నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ కమిటీకి కన్వీనర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, యూత్ కమిటీ కి కన్వీనర్ గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎకానమీ కమిటీ కి కన్వీనర్ గా మాజీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ కమిటీ కన్వీనర్గా మాజీ పిసిసి అధ్యక్షుడు వీహెచ్ హనుమంతరావులను నియామకం చేసినట్లు వెల్లడించారు.

గాంధీభవన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..

జూన్ 2న (గురువారం) హైదరాబాద్ గాంధీ భవన్ తో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్, గీతా రెడ్డి, అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు హజ్మతుల్లా, సునీత రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..