Jammu Kashmir: కశ్మీర్ లోయలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. హిందూ ఉపాధ్యాయురాలిపై కాల్పులు
ఉగ్రవాదులు మంగళవారం ఉదయం హిందూ ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపారు.
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో దారుణానికి తెగబడ్డారు. దక్షిణ కాశ్మీర్ కుల్గాం జిల్లాలోని గోపాల్‌పొరా ప్రాంతంలో హైస్కూల్ హిందూ ఉపాధ్యాయురాలిని పొట్టనబెట్టుకున్నారు. ఉగ్రవాదులు మంగళవారం ఉదయం ఆమెపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు, పోలీసుల బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని.. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. మృతురాలిని రజనీ భల్లాగా పోలీసులు గుర్తించారు. రజనీ జమ్మూ డివిజన్‌లోని సాంబా జిల్లా నివాసి అని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. కాల్పులకు తెగబడ్డ వారిని త్వరలోనే గుర్తించి.. మట్టుబెడుతామన్నారు.
కాగా.. ఈ ఘటనపై నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోయలో ఉగ్రవాదులు రెచ్చిపోతుండటంతో అంతటా భయాందోళన నెలకొంది. మే 12న బుద్గామ్ జిల్లాలో రాహుల్ భట్ అనే రెవెన్యూ శాఖ ఉద్యోగిని ఉగ్రవాదులు హతమార్చారు. గత వారం బుద్గామ్‌లోని చదూరా పరిసరాల్లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ ను కాల్చి చంపగా.. తాగా ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపారు.
#KulgamTerrorIncidentUpdate: Injured lady teacher, a #Hindu & resident of Samba (Jammu division) #succumbed to her injuries. #Terrorists involved in this #gruesome #terror crime will be soon identified & neutralised.@JmuKmrPolice https://t.co/8rZR3dMmLY
— Kashmir Zone Police (@KashmirPolice) May 31, 2022
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..