- Telugu News Photo Gallery Dark circles remov tips dark circles can be easily removed with these home remedies au50
Dark Circles:ఈ హోం రెమిడీస్‌తో కళ్లకింద నల్లటి వలయాలని సులభంగా తొలగించవచ్చు..!
Dark Circles:నిద్ర సరిగా పట్టకపోవడం, ఒత్తిడి, ఎక్కువ సేపు స్క్రీన్ చూడడం, అనారోగ్యకరమైన ఆహారం వంటి కారణాల వల్ల చాలా మంది డార్క్ సర్కిల్స్ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Updated on: May 31, 2022 | 5:40 PM

నిద్ర సరిగా పట్టకపోవడం, ఒత్తిడి, ఎక్కువ సేపు స్క్రీన్ చూడడం, అనారోగ్యకరమైన ఆహారం వంటి కారణాల వల్ల చాలా మంది డార్క్ సర్కిల్స్ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు నల్లటి వలయాలను వదిలించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలని ప్రయత్నించవచ్చు.

నల్లటి వలయాలను తొలగించడానికి టమోట బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం ఒక చెంచా టమోటా రసంలో ఒక చెంచా నిమ్మరసం కలపండి. డార్క్ సర్కిల్ మీద 10 నిమిషాలు అప్లై చేయండి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది.

బంగాళదుంపని తీసుకొని బాగా కడిగి దానిని గుండ్రంగా కట్ చేయండి. ఆ ముక్కలని డార్క్ సర్కిల్ మీద పెట్టుకోండి. 10 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది నల్లటి వలయాలను తొలగించడంలో సహాయపడుతుంది.

మీరు నల్లటి వలయాలను తొలగించడానికి గ్లిజరిన్, నారింజ రసం ఉపయోగించవచ్చు. ఇందుకోసం కొన్ని చుక్కల నారింజ రసం, గ్లిజరిన్ మిక్స్ చేసి డార్క్ సర్కిల్స్‌పై అప్లై చేయాలి. ఇది డార్క్ సర్కిల్స్ ను తొలగిస్తుంది.

మీరు చల్లని పాలను ఉపయోగించి కూడా డార్క్ సర్కిల్స్‌ని తొలగించుకోవచ్చు. దీని కోసం చల్లటి పాలు తీసుకొని అందులో కాటన్ ముంచి డార్క్ సర్కిల్స్‌పై అప్లై చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది.





























