- Telugu News Photo Gallery Cinema photos Superstar krishna birthday special photo gallery on 31 05 2022
Happy Birthday Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే స్పెషల్ ఫోటో గ్యాలెరీ..
తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి హాలీవుడ్ చిత్రాల్లోని పాత్రలను పరిచయం చేశారు సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna). కౌబాయ్, జేమ్స్ బాండ్ వంటి హాలీవుడ్ చిత్రాల ప్రయోగాలను చేసి సక్సెస్ అయ్యారు.
Updated on: May 31, 2022 | 5:16 PM

తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి హాలీవుడ్ చిత్రాల్లోని పాత్రలను పరిచయం చేశారు సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna). కౌబాయ్, జేమ్స్ బాండ్ వంటి హాలీవుడ్ చిత్రాల ప్రయోగాలను చేసి సక్సెస్ అయ్యారు.

అంతేకాకుండా.. తెలుగు చిత్రపరిశ్రమలో అప్పుడప్పుడే హైటెక్నాలజీ అప్డేట్ అవుతున్న సమయంలో సాంకేతిక టెక్నాలజీని జోడిస్తూ సినిమాలను తెరకెక్కించారు. ఇప్పటికీ టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోలలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు.

ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు.. నేటితో ఆయన 79 ఏళ్లు పూర్తిచేసుకుని.. 80వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.

ఇండియన్ పీపుల్స్ థియేటర్ వారి నాటకాల్లో స్వర్గీయ డాక్టర్ రాజరావుగారి నిర్వహణలో అనేక ప్రదర్శనలో పాల్గోన్నాడు కృష్ణ.

ఆ సమయంలో సినిమా నటుడు కావాలనే కోరిక మరింత బలంగా మారిందట. 1960లో మద్రాసు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించినప్పటికీ నిరాశే ఎదురైంది.

ఆ తర్వాత ఏడాది అనంతరం బాబూ మూవీస్ ప్రకటనకు దరఖాస్తు చేశాడు.. బాబూ మూవీస్ స్కూల్లోనే నటనకు కావాల్సిన నైపుణ్యాలు, గుర్రపు స్వారీ, కారు డ్రైవింగ్ ఇలా అన్నింటిని నేర్చుకున్నాడు.

తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ మూవీ 'గూఢచారి 116' బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో కృష్ణ హీరోగా నిలదొక్కుకున్నారు.

'మోసగాళ్ళకు మోసగాడు' మూవీతో తెలుగు సినిమాకు కౌబాయ్‌ను పరిచయం చేశారు. తొలి ఫుల్‌స్కోప్ సినిమా 'అల్లూరి సీతారామరాజు'తో చరిత్ర సృష్టించారు.




