AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : క్లైమాక్స్ కోసం థియేటర్లకు వచ్చిన అడియన్స్.. ఊహించని ట్విస్టులతో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..

ఈ సినిమా క్లైమాక్స్ చూసేందుకే జనాలు థియేటర్లలకు పరుగులు పెట్టారు. ఆద్యంతం ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ఆద్యంతం కట్టిపడేసే సస్పెన్స్ ఉన్న ఈ సినిమా ఈవారం ఓటీటీలో చూడదగ్గ థ్రిల్లర్ చిత్రం అని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసుకుందామా.

Cinema : క్లైమాక్స్ కోసం థియేటర్లకు వచ్చిన అడియన్స్.. ఊహించని ట్విస్టులతో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
Rorschach Movie
Rajitha Chanti
|

Updated on: Feb 22, 2026 | 2:20 PM

Share

వీకెండ్ వచ్చిందంటే ఓటీటీలో ఏ సినిమాలు చూడాలా.. ? అని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఈమధ్యకాలంలో సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ కంటెంట్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా మీకు ఈ వారాంతంలో చూడదగ్గ మూవీ అని చెప్పుకోవచ్చు. మనం చూడబోయే సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సినీప్రియులను ఆకట్టుకుంటుంది. ఇందులో మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా నటించారు. ఈ చిత్రానికి నిషామ్ బషీర్ దర్శకత్వం వహించారు. ఆ మూవీ పేరు రోర్ షాచ్. ఇది 2022లో థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో గ్రేస్ ఆంటోనీ, బిందు పనికర్, ఆసిఫ్ అలీ తదితరులు నటించారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

ఈ చిత్రానికి అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా. ఇది మొదటి సన్నివేశం నుంచి చివరి వరకు మిమ్మల్ని మీ సీటు నుంచి కదలనివ్వదు. దాదాపు 2 గంటల 30 నిమిషాలపాటు సాగే ఈ సినిమా ఆద్యంతం ఊహించని ట్విస్టులతో ఏం జరుగుతుందో అర్థం కాకుండా సాగుతుంది. ముందుగా ఒక కారు ప్రమాదంతో ప్రారంభమవుతుంది. ఇందులో మమ్ముట్టి ల్యూక్ ఆంటోనీ పాత్రను పోషించాడు. ప్రమాదం తర్వాత, ల్యూక్ గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్య కనిపించడం లేదని ఆరోపిస్తాడు. ల్యూక్ చర్యలు అనుమానాన్ని రేకెత్తిస్తాయి. పోలీసులు వెతికినా ల్యూక్ భార్యను మాత్రం కనుగొనలేకపోయారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..

ల్యూక్ తన భార్యను వెతుక్కుంటూ స్వయంగా బయలుదేరుతాడు. చివరికి అతను తన భార్యను కనుగొన్నాడా? లేదా? ఏమి జరిగిందనేది కథ. ఈ సినిమా ప్రతి క్షణం ప్రేక్షకులను ఆసక్తిని కలిగిస్తుంటాయి. ప్రస్తుతం ఈ మూవీ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. రూ.40 కోట్లకు పైగా వసూలు చేసింది. వారాంతంలో సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలనుకునేవారికిఈ సినిమా మంచి ఎంపిక కావచ్చు.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

Follow Us