AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: గుడ్లు తింటే అలెర్జీ వస్తోందా.. బదులుగా ఈ 3 పదార్థాలు తింటే పోషకాలు ఫుల్..

ఈ మూడు పదార్థాలు శాఖాహారం, శాకాహారి వ్యక్తులకు గుడ్డు ప్రత్యామ్నాయంగా ఉంటాయి. మీరు గుడ్లు తినకపోతే ఈ పదార్థాల నుంచి పోషకాలను పొందవచ్చు.

Health Tips: గుడ్లు తింటే అలెర్జీ వస్తోందా.. బదులుగా ఈ 3 పదార్థాలు తింటే పోషకాలు ఫుల్..
Eggs
Venkata Chari
|

Updated on: May 31, 2022 | 7:52 AM

Share

గుడ్లు తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ, కొంతమందికి గుడ్లు అంటే అలెర్జీ. అదే సమయంలో, కొంతమంది గుడ్లు తినడానికి ఇష్టపడరు. వేగన్ డైట్ పాటించే వారు కూడా గుడ్లు తినడానికి ఇష్టపడరు. ఇటువంటి పరిస్థితిలో గుడ్లు వంటి పోషకాలను ఎలా పొందాలనే ప్రశ్న తలెత్తుతుంది. గుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో గుడ్లు తినని వారు ఈ శాఖాహారంతో ఎగ్స్ కొరతను తీర్చుకోవచ్చు. ఈ 3 పదార్థాలను తీసుకుంటే గుడ్డులో ఉన్న అన్ని ప్రయోజనాలను పొందవచ్చు.

1. సోయా – మీరు గుడ్లు తినకపోతే, బదులుగా సోయాబీన్స్ తినవచ్చు. సోయాబీన్ గుడ్లకు గొప్ప ప్రత్యామ్నాయం. సోయాబీన్స్‌లో ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. శాకాహారులు తమ రోజువారీ ఆహారంలో సోయాబీన్స్‌ను చేర్చుకోవచ్చు. సోయాబీన్స్‌లో ఖనిజాలు, విటమిన్ బీ కాంప్లెక్స్, విటమిన్ ఏ ఉంటాయి. సోయాబీన్ ఆరోగ్యానికి మంచిది.

2. వేరుశెనగ- వేరుశెనగ చలికాలంలో చాలా మేలు చేస్తుంది. గుడ్లు తినని వారు తప్పనిసరిగా వేరుశెనగ తినాలి. వేరుశెనగలో మంచి మొత్తంలో ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. వేరుశెనగలో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇందులో మంచి మొత్తంలో ఐరన్, ఫోలేట్, కాల్షియం, జింక్ ఉన్నాయి. మీరు గుడ్లకు బదులుగా వేరుశెనగను ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

3. బ్రోకలీ – ప్రోటీన్ రిచ్ భోజనం కోసం, మీరు గుడ్లకు బదులుగా బ్రోకలీని ఉపయోగించవచ్చు. బ్రోకలీలో ప్రోటీన్‌తో పాటు కాల్షియం, ఐరన్, విటమిన్-ఏ, విటమిన్-సి, కార్బోహైడ్రేట్‌లు వంటి అనేక పోషక మూలకాలు ఉన్నాయి. చలికాలంలో గుడ్లు తినని వారికి బ్రకోలీ మంచి ఎంపిక.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సలహాలుగా మాత్రమే తీసుకోవాలి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు, వైద్యుడిని సంప్రదించండి.

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ