- Telugu News Photo Gallery Healthy Foods To keep the stomach clean Add these foods in your diet Telugu Health Tips
Health Tips: పొట్ట శుభ్రంగా ఉండాలంటే వీటిని తప్పనిసరిగా తినండి.. మలబద్దకం, అజీర్తికి చక్కని ఫుడ్
ఎల్లప్పుడూ కడుపు శుభ్రంగా ఉంచడానికి మీరు ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన వాటిని చేర్చుకోవాలి. దీని ద్వారా పొట్ట శుభ్రంగా ఉండటంతోపాటు.. ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Updated on: May 30, 2022 | 8:36 PM

ఓ వైపు బిజీ షెడ్యూల్, మరోవైపు పని ఒత్తిడి ఇలాంటి సందర్భాల్లో ఏవి పడితే అవి తింటుంటారు. అయితే..చాలా సార్లు అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం వల్ల కడుపులో ఇబ్బంది కలుగుతుంది. ఈ సమయంలో కడుపు నొప్పి, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చుకోవడం మంచిది.

ఆపిల్- యాపిల్స్‌లో ఐరన్, జింక్, కాల్షియం, మెగ్నీషియం, ప్రొటీన్, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి. పొట్టను ఆరోగ్యంగా ఉంచేందుకు ఇవి పనిచేస్తాయి. ఇంకా మలబద్ధకం సమస్యను యాపిల్ దూరం చేస్తుంది. పొట్టను శుభ్రంగా ఉంచుకోవడానికి మీరు క్రమం తప్పకుండా యాపిల్స్ తినవచ్చు.

అవిసె గింజలు- అవిసె గింజలను సూపర్ ఫుడ్స్ అంటారు. ఇవి కడుపు నొప్పి, మలబద్ధకం వంటి ఉదర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. ఈ గింజలు పొట్టను శుభ్రంగా ఉంచుతాయి. మీరు వాటిని ఫ్రూట్ జ్యూస్‌లో లేదా సలాడ్లలో చేర్చుకోవచ్చు.

అవకాడో - ఆహారంలో అవకాడోను చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కడుపు నొప్పి, అల్సర్లు, అసిడిటీ, పేగు మంట నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది పొట్టను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

బొప్పాయి - పొట్ట శుభ్రంగా ఉండాలంటే బొప్పాయి తప్పనిసరిగా తినండి. ఇందులో పాపైన్ ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.




