AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Prize Money: ఆటగాళ్లపై కురిసిన కనక వర్షం.. ఎవరికి ఎంత డబ్బు వచ్చిందంటే?

IPL 2022 Final: గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2022 టైటిల్‌ను కైవసం చేసుకుంది. విజయం తర్వాత ఎవరికి ఎంత ప్రైజ్ మనీ వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

IPL 2022 Prize Money: ఆటగాళ్లపై కురిసిన కనక వర్షం.. ఎవరికి ఎంత డబ్బు వచ్చిందంటే?
Ipl 2022 Prize Money
Venkata Chari
|

Updated on: May 30, 2022 | 6:00 AM

Share

గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2022(IPL 2022) టైటిల్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. గుజరాత్ విజయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. అతను ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పాండ్యా 34 పరుగులతో పాటు 3 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు టైటిల్స్‌తో పాటు ప్రైజ్‌మనీ దక్కింది. జోస్ బట్లర్ ఈ సీజన్ పర్పుల్ క్యాప్ గెలుచుకోగా, యుజ్వేంద్ర చాహల్ పర్పుల్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో అత్యధిక పరుగులు చేసిన పరంగా రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 17 మ్యాచ్‌లు ఆడి 863 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 4 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు సాధించాడు. బట్లర్ ఆరెంజ్ క్యాప్‌ని కైవసం చేసుకున్నాడు. అతనికి పారితోషికంగా రూ.15 లక్షలు ఇచ్చారు. చాహల్ పర్పుల్ క్యాప్ గెలుచుకోవడంతోపాటు రూ.15 లక్షలు అందుకున్నాడు. ఈ సీజన్‌లో చాహల్ 17 మ్యాచుల్లో 27 వికెట్లు తీశాడు.

ఈ సీజన్‌లో బట్లర్ బలమైన ప్రదర్శన ఇచ్చాడు. అతనికి మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అనే బిరుదు కూడా ఇచ్చారు. ఇందులో అతనికి రూ.12 లక్షల ప్రైజ్ మనీ లభించింది. బట్లర్ 387.5 పాయింట్లు సాధించాడు. కాగా ఈ విషయంలో హార్దిక్ పాండ్యా రెండో స్థానంలో నిలిచాడు. అతను 284.5 పాయింట్లు సాధించాడు.

ఇవి కూడా చదవండి

ఎవరికి ఎంత డబ్బు లభించిందంటే..

విజేత జట్టు: గుజరాత్ టైటాన్స్, రూ. 20 కోట్లు

ఓడిన జట్టు: రాజస్థాన్ రాయల్స్, రూ.13 కోట్లు

నం. 3 జట్టు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రూ. 7 కోట్లు

నం. 4 జట్టు: లక్నో సూపర్ జెయింట్స్, రూ.6.5 కోట్లు

పర్పుల్ క్యాప్ విజేత: యుజ్వేంద్ర చాహల్, రూ. 15 లక్షలు

ఆరెంజ్ క్యాప్ విజేత: జోస్ బట్లర్, రూ. 15 లక్షలు

సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: దినేష్ కార్తీక్, రూ. 15 లక్షలు, టాటా పంచ్ కార్

పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: జోస్ బట్లర్, రూ. 12 లక్షలు

సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడు: జోస్ బట్లర్, రూ. 12 లక్షలు

గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్: జోస్ బట్లర్, రూ. 12 లక్షలు

ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: ఉమ్రాన్ మాలిక్, రూ. 20 లక్షలు

సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు: జోస్ బట్లర్, రూ. 10 లక్షలు

సీజన్‌లో వేగవంతమైన బాల్: లాకీ ఫెర్గూసన్, రూ. 10 లక్షలు

సీజన్‌లో అత్యధిక ఫోర్లు: జోస్ బట్లర్, రూ. 10 లక్షలు

క్యాచ్ ఆఫ్ ది సీజన్: ఎవిన్ లూయిస్, రూ. 10 లక్షలు

Follow Us
బరువైన దుప్పట్లు సులభంగా ఉతకడం ఎలా? ఈజీ హోమ్ క్లీనింగ్ టిప్స్‌
బరువైన దుప్పట్లు సులభంగా ఉతకడం ఎలా? ఈజీ హోమ్ క్లీనింగ్ టిప్స్‌
మమ్మల్ని తక్కువగా చూడొద్దు.! జింబాబ్వే గట్టి వార్నింగ్
మమ్మల్ని తక్కువగా చూడొద్దు.! జింబాబ్వే గట్టి వార్నింగ్
4 ఏళ్ల పెళ్లి బంధానికి ముగింపు చెప్పిన టీమిండియా ప్లేయర్..
4 ఏళ్ల పెళ్లి బంధానికి ముగింపు చెప్పిన టీమిండియా ప్లేయర్..
టొమాటో దోసె.. 5 నిముషాల్లో ఇలా చేసేయండి.. రుచి అదిరిపోతోంది!
టొమాటో దోసె.. 5 నిముషాల్లో ఇలా చేసేయండి.. రుచి అదిరిపోతోంది!
అరటి కాయలతో అదిరిపోయే లాభాలు.. తెలిస్తే తొక్కను కూడా వేస్ట్ చేయరు
అరటి కాయలతో అదిరిపోయే లాభాలు.. తెలిస్తే తొక్కను కూడా వేస్ట్ చేయరు
ఆరోగ్యానికి మంచివే.. అతిగా తింటే మాత్రం ఆ సమస్యలు తప్పవు
ఆరోగ్యానికి మంచివే.. అతిగా తింటే మాత్రం ఆ సమస్యలు తప్పవు
ఐఫోన్‏తో షూటింగ్.. వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్..
ఐఫోన్‏తో షూటింగ్.. వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్..
ఉరిసి జ్యూస్ లేదా పసుపు నీరు.. అందమైన చర్మం కోసం ఏది బెస్ట్!
ఉరిసి జ్యూస్ లేదా పసుపు నీరు.. అందమైన చర్మం కోసం ఏది బెస్ట్!
ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు..
ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు..
'ది కేరళ స్టోరీ' మూవీకి మరో బిగ్ షాక్.. హైకోర్టు కీలక ఆదేశాలు
'ది కేరళ స్టోరీ' మూవీకి మరో బిగ్ షాక్.. హైకోర్టు కీలక ఆదేశాలు