లవంగమే కదా అని లైట్ తీసుకుంటే పొరపడినట్టే..! రోజూ తింటే మీ బాడీలో అద్భుతాలు జరుగుతాయి..!!

తులసి ఆకులు, పుదీనా ఆకులు, లవంగాలు, యాలకుల మిశ్రమంతో కషాయం చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కొన్ని లవంగాలు తీసుకుని వాటికి పసుపు, చక్కెర కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తాగితే శరీరానికి మంచి చేస్తుంది.

లవంగమే కదా అని లైట్ తీసుకుంటే పొరపడినట్టే..! రోజూ తింటే మీ బాడీలో అద్భుతాలు జరుగుతాయి..!!
Cloves uses
Follow us

|

Updated on: Jul 10, 2024 | 7:23 PM

ప్రతి వంటింటి పోపుల పెట్టెలో ఉండే మసాలా దినుసులు మన ఆరోగ్యానికి దివ్యౌషధం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అందులో లవంగాలు ఒకటి. ఇది చాలా ఘాటుగా, అతి స్వల్పంగా తీపి కూడా ఉన్నట్టు అనిపించే లవంగాలతో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తరచూ చెబుతుంటారు. లవంగాలను ప్రతిరోజు రెండు చొప్పున తినడం వల్ల మీరు ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషక పదార్థాలు దీర్ఘకాలిక వ్యాధులను సైతం దూరం చేస్తాయని అంటున్నారు. లవంగాల్లో ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, హైడ్రాలిక్ ఆసిడ్, మాంగనీస్, విటమిన్ ఏ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. లవంగాలలో ‘నైజీరిసిన్’ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది డయాబెటిస్‌ను నివారించడంలో, ఇన్సులిన్ చర్యను మెరుగుపర్చడంలో, నూతన కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. పొటాషియం, ఐర‌న్, క్యాల్షియం వంటి ఎన్నో మిన‌ర‌ల్స్, విట‌మిన్స్ లవంగంలో దొరుకుతాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. రోజూ రాత్రి భోజనం తర్వాత రెండు లేదా మూడు లవంగాలు తింటే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ల‌వంగాల‌ను తింటే జీవ‌క్రియ‌ల రేటు పెరుగుతుంది. సుల‌భంగా బ‌రువు తగ్గుతారు. మనం ప్రతి రోజు తాగే టీ లో లవంగం వేసుకొని తాగితే కడుపుబ్బరం తగ్గుతుంది. క్రమం తప్పకుండా ఆహారం లో లవంగాన్ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి, ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది. వాతావరణం మార్పు వల్ల వచ్చే రుగ్మతలకు లవంగం మంచి మందులా పని చేస్తుంది.

లవంగాలను తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అవాంఛిత కొవ్వును తొలగించడానికి సహాయపడుతుంది. భోజనం తర్వాత లవంగాలను నోటిలో వేసుకుని నమలడం వల్ల నోటి దుర్వాసనను తొలగించడమే కాకుండా నోట్లో తయారయ్యే బ్యాక్టీరియాను చంపుతుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. జలుబు, దగ్గుకు లవంగం మంచి మందు. నోట్లో ఓ రెండు లవంగాలు వేసుకొని చప్పరిస్తుంటే ఉపశమనం లభిస్తుంది. లవంగాలను పొడి చేసి నీళ్ళలో తడిపి ఈ ముద్దను ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనస్ తగ్గి ఉపశమనం కలుగుతుంది. లవంగంలో మాంగనీసు పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, ఎముకలు దృఢంగా మారేందుకు లవంగాలు సహకరిస్తాయి.

ఇవి కూడా చదవండి

తులసి ఆకులు, పుదీనా ఆకులు, లవంగాలు, యాలకుల మిశ్రమంతో కషాయం చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కొన్ని లవంగాలు తీసుకుని వాటికి పసుపు, చక్కెర కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తాగితే శరీరానికి మంచి చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రూ.3.5 లక్షలు ఉంటే ప్రపంచంలోని 50 శాతం మంది మీ కిందే..!
రూ.3.5 లక్షలు ఉంటే ప్రపంచంలోని 50 శాతం మంది మీ కిందే..!
అర్హత ఉన్నా గృహజ్యోతి అమలు అవ్వట్లేదా..? మీకే ఈ తీపి కబురు
అర్హత ఉన్నా గృహజ్యోతి అమలు అవ్వట్లేదా..? మీకే ఈ తీపి కబురు
ఈ బిగ్ బాస్ బ్యూటీని గుర్తు పట్టారా? ఆర్జీవీకి బాగా క్లోజ్
ఈ బిగ్ బాస్ బ్యూటీని గుర్తు పట్టారా? ఆర్జీవీకి బాగా క్లోజ్
ఆయన్ని అలా చూస్తే నేను తట్టుకోలేను..
ఆయన్ని అలా చూస్తే నేను తట్టుకోలేను..
ఈ డ్రైఫ్రూట్స్‌ను నానబెట్టి తినడం షుగర్ పేషెంట్స్‌కు ఓ వరం..
ఈ డ్రైఫ్రూట్స్‌ను నానబెట్టి తినడం షుగర్ పేషెంట్స్‌కు ఓ వరం..
చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశం
చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశం
క్రెడిట్‌ కార్డుపై అప్పు ఉన్న వ్యక్తి చనిపోతే బిల్లు కట్టాలా.?
క్రెడిట్‌ కార్డుపై అప్పు ఉన్న వ్యక్తి చనిపోతే బిల్లు కట్టాలా.?
అదరగొడుతున్న మోటోరోలా ఫోన్ ఫీచర్స్..రూ.18వేలకే కర్వ్‌డ్ డిస్‌ప్లే
అదరగొడుతున్న మోటోరోలా ఫోన్ ఫీచర్స్..రూ.18వేలకే కర్వ్‌డ్ డిస్‌ప్లే
నైవేద్యం ఆలస్యమైతే కన్నయ్య సన్నబడతాడు.. ఈ ఆలయం ఎక్కడో తెలుసా
నైవేద్యం ఆలస్యమైతే కన్నయ్య సన్నబడతాడు.. ఈ ఆలయం ఎక్కడో తెలుసా
నిరుద్యోగంపై కేంద్రం సమరం..ఉద్యోగులను ప్రోత్సహించేలా కొత్త పథకాలు
నిరుద్యోగంపై కేంద్రం సమరం..ఉద్యోగులను ప్రోత్సహించేలా కొత్త పథకాలు