పొట్టు మినపప్పుతో పుట్టెడు లాభాలు.. మధుమేహులకు మస్త్ బెనిఫిట్స్..!
అందుకే ఈ పప్పును పోషకాల గనిగా చెబుతున్నారు నిపుణులు. మినప పప్పులో ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాల్షియంతో పాటు ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మినప పప్పులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. కాబట్టి, దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చంటున్నారు నిపుణులు.

మినప పప్పు కేవలం వంటకాల రుచిని పెంచడం మాత్రమే కాదు.. దీనిని తీసుకోవడం ద్వారా బోలెడు హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చంటున్నారు పోషకాహర నిపుణులు. అందుకే ఈ పప్పును పోషకాల గనిగా చెబుతున్నారు నిపుణులు. మినప పప్పులో ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాల్షియంతో పాటు ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మినప పప్పులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. కాబట్టి, దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చంటున్నారు నిపుణులు.
ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు మినప పప్పుతో చేసిన వంటకాలు డైలీ డైట్లో చేర్చుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు. పొట్టు మినపప్పుతో మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు. షుగర్బాధితులు మినప పప్పును డైలీ డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పొట్టు తీయని మినప పప్పును తీసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనకరం.ఈ పప్పులో పుష్కలంగా ఉండే ఫైబర్, ప్రొటీన్లతో పాటు ఇతర పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచడానికి చాలా బాగా సహాయపడతాయంటున్నారు.
మినప పప్పులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గించడానికి ఇది చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు. కిడ్నీల సంరక్షణకు మరింత మంచిది. మినప పప్పులో సమృద్ధిగా ఉండే కాల్షియం, పాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి.బరువు తగ్గాలనుకునేవారికి మరింత మంచిది. మినప పప్పు చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఈ పప్పులోని పోషకాలు సన్ టాన్స్, మొటిమలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. అంతేకాదు..ఈ పప్పుతో జుట్టు సంరక్షణకు కూడా మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








