AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. అందుబాటులోకి శ్రీవారి మొబైల్స్.. దక్కించుకోండిలా..!!

ఈ-వేలంలో వీటిలో కార్భన్, ఎల్ వై ఎఫ్, నోకియా, శాంసంగ్, లావా, ఐటెల్, లెనోవా, ఫిలిప్స్, ఎల్.జి.సాంసుయ్, ఒప్పో, పోకో, ఏసర్, పానా సోనిక్, హానర్, వన్ ప్లస్, బ్లాక్ బెర్రీ, జియోనీ, మైక్రో సాఫ్ట్ , ఆసస్ , కూల్ పాడ్, హెచ్.టి.సి, మోటోరోలా, టెక్నో, ఇంఫినిక్స్, రియల్ మీ, హువాయ్, సెల్కన్, వినో, మైక్రో మాక్స్ మరియు ఇతర మొబైల్ ఫోన్లు EA ID Nos. 25180, 25181, 25182, 25183 ఆన్ లైన్ లో ఈ వేలం వేయనున్నారు' ఈ మేరకు టీటీడీ వివరాలు వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం టీటీడీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. అందుబాటులోకి శ్రీవారి మొబైల్స్.. దక్కించుకోండిలా..!!
Tirumala
Jyothi Gadda
|

Updated on: Jul 24, 2025 | 9:28 AM

Share

తిరుమల వెంకన్న భక్తులకు ఇది ఒక రకమైన శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే.. శ్రీవారి మొబైల్‌ఫోన్స్‌ దక్కించుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది టీటీడీ. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాల్లో స్వామివారికి భక్తులు కానుకలుగ ఆసమర్పించిన మొబైల్‌ ఫోన్లను భక్తుల కోసం వేలం వేయనున్నారు. ఆగష్టు 04వ తేదీ నుండి 05వ తేదీ వరకు టీటీడీలో ఆన్ లైన్ ద్వారా ఈ మొబైల్‌ ఫోన్లను ఈ వేలం (ఆన్ లైన్) వేయనున్నారు. ఇందులో ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న (73) లాట్ల మొబైల్ ఫోన్లను విక్రయించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ ద్వారా టీటీడీ మొబైల్‌ ఫోన్లను ఈ-వేలానికి ఉంచనుంది.. ఈ-వేలంలో వీటిలో కార్భన్, ఎల్ వై ఎఫ్, నోకియా, శాంసంగ్, లావా, ఐటెల్, లెనోవా, ఫిలిప్స్, ఎల్.జి.సాంసుయ్, ఒప్పో, పోకో, ఏసర్, పానా సోనిక్, హానర్, వన్ ప్లస్, బ్లాక్ బెర్రీ, జియోనీ, మైక్రో సాఫ్ట్ , ఆసస్ , కూల్ పాడ్, హెచ్.టి.సి, మోటోరోలా, టెక్నో, ఇంఫినిక్స్, రియల్ మీ, హువాయ్, సెల్కన్, వినో, మైక్రో మాక్స్ మరియు ఇతర మొబైల్ ఫోన్లు EA ID Nos. 25180, 25181, 25182, 25183 ఆన్ లైన్ లో ఈ వేలం వేయనున్నారు’ ఈ మేరకు టీటీడీ వివరాలు వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం టీటీడీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఆసక్తి ఉన్నవారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ – కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ అయిన బిడ్డర్లు వేలంలో పాల్గొనడానికి అర్హులు. ఈ వేలానికి సంబంధించి ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్ ( వేలములు) / ఏఈవో ( వేలములు), టీటీడీ, హరేకృష్ణ మార్గ్, తిరుపతిలో https://konugolu.ap.gov.in లేదా టీటీడీ వెబ్ సైట్ www.tirumala.org లేదా 0877 – 2264429 ఫోన్ నెంబర్ ద్వారా గాని సంప్రదించగలరు’ అని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి